Breaking News

‘హను-మాన్‌’ గురించి ఈ విషయాలు తెలుసా?

Published on Thu, 01/11/2024 - 16:53

యంగ్‌ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘హను-మాన్‌’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హను-మాన్‌ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...

♦ ‘జాంబి రెడ్డి’ తర్వాత ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరి చుట్టే కథ తిరుగుతంది. 

♦ హను-మాన్‌ షూటింగ్‌ 2021 జూన్‌ 5న ప్రారంభమైంది. వట్టినాగుపల్లిలో ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ స్థాయిలోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ నిర్మాత ప్రొత్సాహంతోనే పాన్‌ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దారు. మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతుంది.

♦ ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్‌ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు

♦ ఈ చిత్రం మొత్తం ఫుటేజీ నిడివి 2.45 గంటలు. సెన్సార్‌ తర్వాత ఇది 2.38 గంటలు అయింది. సినిమాకు ఏది అవసరమో దాన్నే షూట్‌ చేశామని, కేవలం ఐదారు నిమిషాలు ఫుటేజ్‌ మాత్రమే వృధా అయిందని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెప్పారు. 

♦ ఈ సినిమాను గతేడాది మే 12న విడుదల చేయాల్సింది. కానీ వీఎఫెక్స్‌ వర్క్‌ పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేస్తూ.. చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. 

♦ ఈ చిత్రంలో మొత్తం 1600 వీఎఫెక్స్‌ ఫాట్స్‌ ఉన్నాయట. వానరం, ఎలుకలు, చిరుత, పులి ఇవన్నీ వీఎఫెక్స్‌  సాధ్యమైయ్యాయని దర్శకుడు చెప్పాడు. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్తతరం వీఎఫెక్స్‌ టీమ్‌తో పని చేశారట. ఔట్‌ఫుట్‌ మాత్రం అద్భుతంగా ఉంది. 

♦ ఓ సారి అడవిలో షూటింగ్‌ చేస్తున్న సమయంలో తేజ సజ్జకు తృటిలో ప్రమాదం తప్పిందట. చెట్టుకింద ఓ సన్నివేశాన్ని  షూట్‌ చేస్తుంటే.. ఓ పాము తేజ సజ్జదగ్గరకు వచ్చిందంట. డైరెక్టర్‌ మానిటర్‌లో చూస్తే అది పాములా కనిపించలేదట. పక్కనే ఉన్న వ్యక్తి చెప్పబోతుంటే డైరెక్టర్‌ పట్టించుకోలేదట. షాట్‌ పూర్తయిన తర్వాత అక్కడ పాము ఉందని చెప్పడంతో అంతా భయంతో పరుగులు తీశారట. 

 ♦ ఈ చిత్రంలో 'వాన' హీరో వినయ్ రాయ్ విలన్​ రోల్​లో కనిపించనుండగా, అషికా రంగనాథ్​, వరలక్ష్మి శరత్​కుమార్​ కీలక పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడిగా చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్‌. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం  ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా చెప్పలేదు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)