Breaking News

‘చమ్కీల అంగీలేసి..’ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన ఈ చిన్నదెవరో తెలుసా?

Published on Sun, 03/19/2023 - 19:14

‘చమ్కీల అంగీలేసి ఓ వదినే.. 
చాకు లెక్కుండేటోడే ఓ వదినే.. 
కండ్లకు ఐనా బెట్టి.. కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే..’

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. అచ్చమైన తెలంగాణలో యాసలో సాగే  ఈ పాట నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమాలోనిది. అయితే అందరి దృష్టి ఈ పాటలోని లిరిక్స్‌, మ్యూజిక్‌ కంటే.. అది ఆలపించిన ఫీమేల్‌ సింగర్‌పైనే ఎక్కువ పడింది. ఇటీవల విడుదలైన లిరికల్‌ వీడియోలో ఆమె తన గొంతుతో పాటు.. హావ భావాలతో అందరికి ఆకర్షించింది. ఇంత చక్కగా ఆలపించిన ఆ ఫీమేల్‌ సింగర్‌ ఎవరబ్బా అని నెటిజన్స్‌ వెతకడం ప్రారంభించారు. 

అయితే ఆమె పక్కా తెలుగమ్మాయి అనుకున్నారంతా.. కానీ ఈ పాట పాడింది ఓ తమిళ అమ్మాయి. ఆమె పేరు దీక్షిత అలియాస్ ధీ. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ ముద్దుల కూతురే ఈ ధీ. ఆస్ట్రేలియాలో చదువుకున్న ధీ..సంగీతంపై ఉన్న మక్కువతో 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 

సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన అనేక సినిమాల్లో ధీ పాటలు పాడింది. ముఖ్యంగా తమిళంలో ఆమె ఆలపించిన పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. తెలుగులో ‘గురు’లోని ‘ఓ సక్కనోడా..’, మారి 2లోని రౌడీ బేబీ, ఆకాశమే హద్దురాలోని కాటుక కనులే’ సాంగ్స్‌ బాగా ఫేమస్‌ అయ్యాయి. 

అయితే ఇన్నాళ్లు ఆమె ఆలపించిన పాటలు అందరికి తెలుసు కానీ. ధీ గురించి మాత్రం ఎవరికి తెలియదు. కానీ ‘చమ్కీల అంగీలేసి..’పాటతో ధీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఓ రకంగా చెప్పాలంటే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)