Breaking News

Avika Gor: ‘చిన్నారి పెళ్లికూతురు’ గురించి ఈ విషయాలు తెలుసా?

Published on Sun, 01/07/2024 - 10:32

అవికా గోర్‌..‘చిన్నారి పెళ్లికూతురు’ ఆనందిగా ఫేమస్‌. ఇటు స్మాల్‌ స్క్రీన్‌.. అటు సిల్వర్‌ స్క్రీన్‌ రెండిట్లోనూ చిన్నప్పటి నుంచే నటించడం మొదలుపెట్టింది. నటిగా ఎన్నో విజయాలందుకున్న ఆమె.. ప్రస్తుతం వెబ్‌స్క్రీన్‌ మీదా అలరిస్తోంది.  

► ముంబైలో పుట్టిపెరిగిన అవికా గోర్‌.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. స్కూల్‌లో కంటే షూటింగ్‌ సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడిపింది.  

► ‘బాలికా వధు’ సీరియల్‌ అవికా జీవితాన్నే మార్చేసింది. ఆ సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది.



► ‘రాజ్‌కుమార్‌ ఆర్యన్‌’, ‘ససురాల్‌ సిమర్‌ కా’ అనే సీరియల్స్‌లోనూ నటించింది. తర్వాత సినీ అవకాశాలు రావడంతో పూర్తిగా వెండితెర మీదే దృష్టి పెట్టింది.

► హిందీలో వరుసగా ‘తేజ్‌’, ‘పాఠ్‌శాలా’ సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెరపై వచ్చిన గుర్తింపు వెండితెరపై రాలేదు. తొలిసారి ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు చిత్రంతో ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. 

 ► ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాల్లో నటించింది. కానీ, తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. 

► లాక్‌డౌన్‌లో.. జీ5లో డైరెక్ట్‌గా రిలీజ్‌ అయిన ‘నెట్‌’ సినిమా అవికాను డిజిటల్‌ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అక్కడ మంచి ఆదరణ లభించడంతో, మళ్లీ అవికా కెరీర్‌ పుంజుకుంది. 

► ప్రస్తుతం అవికా.. డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌లో హిట్‌టాక్‌తో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘వధువు’ అనే థ్రిల్లర్‌ సిరీస్‌తో అలరిస్తోంది . 

ఒకసారి ముంబైలోని ఒక థియేటర్‌లో సినిమా చూడ్డానికి నేను మేజర్‌ని కాదని నన్ను అనుమతించలేదు. నా ఐడీ చూపించి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ చాలామంది నన్ను చిన్నపిల్లలాగే చూస్తుంటారు. చెప్పొద్దూ.. అలా ట్రీట్‌ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది.  – అవికా గోర్‌ 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్