Breaking News

‘గిల్టీ మైండ్స్‌’ భామ దీక్షా జునేజా గురించి ఈ విషయాలు తెలుసా?

Published on Sun, 06/19/2022 - 13:01

అమెజాన్‌ ప్రైమ్‌ లీగల్‌ డ్రామా ‘గిల్టీ మైండ్స్‌’ .. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది వెబ్‌స్క్రీన్‌. అందులో ముఖ్య భూమికలో మెరిసిన నటి.. దీక్షా జునేజా. ఆమె వివరాలు కొన్ని ఇక్కడ.. 

పుట్టింది పంజాబ్‌లోని రాజ్‌పురాలో. పెరిగింది చండీగఢ్‌లో. తల్లిదండ్రులు.. శశి జునేజా, అశోక్‌ జునేజా.  జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివింది దీక్షా. 

► చిన్నప్పటి నుంచే నటన పట్ల ఆసక్తి ఉండడంతో చాలా మంది నటీనటుల్లాగే డిగ్రీ అయిపోగానే యాక్టింగ్‌లో కెరీర్‌ వెదుక్కోవడానికి ముంబై చేరింది. 

ముందు మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. తర్వాత ‘దిల్‌ జో న కహ సకా (2017)’తో బాలీవుడ్‌లో పరిచయం అయితే అయింది కానీ పెద్దగా పేరు రాలేదు. అప్పుడే నెట్‌ఫ్లిక్స్‌ ‘రాజ్మాచావల్‌’లో చాన్స్‌ వచ్చింది హీరోయిన్‌గా. ఆ మూవీతో వెబ్‌ వీక్షకులందరినీ ఆకట్టుకుంది దీక్షా. 



► ఆ వెంటనే ‘గర్ల్‌ఫ్రెండ్‌ చోర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ అవకాశం వచ్చింది. చేసింది. అందులోని దీక్షా నటనా దక్షతను బాలీవుడ్‌ గ్రహించింది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’లో చాన్స్‌ ఇచ్చి ఆమె ప్రతిభను గౌరవించింది.



అనంతరం సోనమ్‌ కపూర్, దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘జోయా ఫ్యాక్టర్‌’లోనూ ఓ పాత్ర పోషించింది. ఆ సినిమాలో ఆ ఇద్దరితో సమంగా పాపులారిటీని సంపాదించుకుంది. తర్వాత మళ్లీ  ‘లవ్, లస్ట్‌ అండ్‌ కన్‌ఫ్యూజన్‌ 2’ అనే వెబ్‌సిరీస్‌లో మంచి రోల్‌ ఆమెను వరించింది.   

► ఇదిగో ఇప్పుడు అమెజాన్‌ హిట్‌ సిరీస్‌ ‘గిల్టీ మైండ్స్‌’..  ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఫాలో అవుతున్న ప్రతి గడపను ఆమె ఫ్యాన్‌గా మార్చేసింది. ఆ అభిమానానికి స్పందిస్తూ ‘రెండేళ్ల కరోనా కాలం తర్వాత ప్రేక్షకుల ఆదరాభిమానాలను ఇంతగా ఆస్వాదిస్తున్నది ఈ సిరీస్‌తోనే. ఇది జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం.. థాంక్యూ.. ’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  

► తీరిక వేళల్లో స్విమ్మింగ్, డాన్స్, ట్రావెలింగ్‌ను ఇష్టపడుతుంది దీక్షా. 

Videos

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)