Breaking News

ఆస్కార్‌ కమిటీలో ఇండియన్‌ స్టార్స్‌

Published on Sat, 06/28/2025 - 01:42

‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అకాడమీలోకి ఆహ్వానిస్తున్నందుకు మాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది. అంకితభావం, నిబద్ధతతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ పురోగతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులు వీరు ’’ అంటూ ఆస్కార్‌ అకాడమీ కమిటీ సీఈవో బిల్‌ క్రామర్, ప్రెసిడెంట్‌ జానెట్‌ యాంగ్‌ పేర్కొన్నారు. 98వ ఆస్కార్‌ అవార్డు వేడుక వచ్చే ఏడాది మార్చి 15 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డు కమిటీ ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా విజేతల ఎంపిక ఓటింగ్‌ కోసం అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినిమా తారలకు ఆహ్వానం పంపింది కమిటీ. ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లుగా పేర్కొంది. వారిలో యాక్టింగ్‌ విభాగంలో ఇండియన్‌ స్టార్స్‌ కమల్‌హాసన్, ఆయుష్మాన్‌ ఖురానాలకు, దర్శకురాలుపాయల్‌ కపాడియా, సినిమాటోగ్రాఫర్‌ రణబీర్‌ దాస్, క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ కరణ్, ఫ్యాషన్‌ డిజైనర్‌ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ స్మృతీ ముంద్రాలకు ఆహ్వానం పంపారు.

ఆస్కార్‌ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి విజేతల ఎంపిక వరకూ సభ్యులు ఓటింగ్‌లోపాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్తగా ఎంపిక చేసిన 534 మంది సభ్యుల్లో స్త్రీల సంఖ్య 41 శాతం ఉన్నట్లు  నిర్వాహకులు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్‌ దక్కించుకున్నవారి జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)