Breaking News

సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా'

Published on Fri, 07/07/2023 - 17:52

సినిమా చూపిస్త మావా.. నీకు సినిమా చూపిస్త మామా.. అంటూ తొలిసారి భారతీయులకు చలనచిత్రాన్ని పరిచయం చేశారు లూమియర్‌ సోదరులు. సరిగ్గా 127 ఏళ్ల క్రితం ఇదే రోజు(జూలై 7న) ఈ అన్నదమ్ములు భారతీయులకు మొట్టమొదటి సారి సినిమా వీక్షించే అవకాశం కల్పించారు. అది కూడా ఒకటో, రెండో అనుకునేరు.. ఏకంగా ఆరు సినిమాలు. అవి ‘ఎంట్రీ ఆఫ్‌ సినిమాటోగ్రాఫ్’, ‘ద సీ బాత్’, ‘అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్’, ‘ఎ డిమాలిషన్’, ‘లేడీస్ అండ్ సోల్జర్స్ ఆన్ వీల్స్’, ‘లీవింగ్ ద ఫ్యాక్టరీ’.

1896లో ముంబైలోని వాట్సన్‌ హోటల్‌లో ఈ సినిమాలను ప్రదర్శించారు. అప్పుడు టికెట్‌ ధర ఎంతనుకునేరు? కేవలం ఒక్క రూపాయి మాత్రమే! ఇండియాలోకి సినిమా అడుగుపెట్టిన ఈ అద్భుత క్షణాలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 'మిరాకిల్‌ ఆఫ్‌ ద సెంచరీ'గా అభివర్ణించింది. ఫ్రెంచ్‌ సినిమాటోగ్రాఫర్లు అయిన ఈ లూమియర్‌ సోదరులు సినిమాలపై తమకున్న పట్టుకున్న పారిస్‌లో నిరూపించుకున్నాకే భారత్‌లో అడుగుపెట్టారు.

1896 జూలై 7న తొలిసారి సినిమా ప్రదర్శించగా దీనికి అద్భుత స్పందన లభించింది. వెంటనే వాళ్లు కోల్‌కతా, చెన్నై నగరాల్లోనూ సినిమా షోలు వేయడం ప్రారంభించారు. రెండో స్క్రీనింగ్‌ ముంబైలోని నొవాల్టీ థియేటర్‌లో జూలై 14న జరగ్గా ఒకేరోజు ఏకంగా 24 సినిమాలు ప్రదర్శించారు. ఆగస్టు 15 వరకు ఈ షోల ప్రదర్శన ఒక పండగలా జరిగింది.

ఇండియన్స్‌ తీసిన సినిమాలు..
ఈ ఉత్సాహంతో హీరాలాల్‌ సేన్‌ అనే ఇండియన్‌ ఫోటోగ్రాఫర్‌ స్టీవెన్‌సన్స్‌ కెమెరా ఉపయోగించి స్టేజీ షోను చిత్రీకరించాడు. ఈ షోకి ద ఫ్లవర్స్‌ ఆఫ్‌ పర్షియా అని నామకరణం చేశారు. హెచ్‌ఎస్‌. భటవ్‌దేకర్‌ 1899లో ద రెజ్లర్స్‌ అనే డాక్యుమెంటరీ చిత్రీకరించాడు. ముంబైలోని హ్యాంగింగ్‌ గార్డెన్స్‌లో ఇద్దరు రెజ్లర్స్‌ తలపడ్డ పోటీని ఆయన లైవ్‌లో చిత్రీకరించాడు.  ఇండియాలో ఇదే తొలి డాక్యుమెంటరీ సినిమాగా గుర్తింపు పొందింది.

చలనచిత్ర పితామహుడు
పూర్తి స్థాయిలో సినిమాను తీసి రిలీజ్‌ చేసింది మాత్రం దాదా సాహెబ్‌ ఫాల్కే. ఈయన 1913లో మరాఠీ భాషలో రాజా హరిశ్చంద్ర అనే మూకీ(సైలెంట్‌) సినిమా తీశాడు. అప్పట్లో ఇది సంచలన విజయం నమోదు చేసుకుంది. భారతీయ సినిమాకు ప్రాణం పోసిన ఈయనను చలనచిత్ర పితామహుడిగా చెప్పుకుంటారు. ఇండియాలో తొలి టాకీ సినిమా ఆలం అరా. అర్దేశిర్‌ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలైంది. అదే ఏడాది తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద కూడా రిలీజైంది.

చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీదైతే నన్నంటారేంటి? నటి ఫైర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)