Breaking News

వైజాగ్‌ స్టేడియంలో నాని సందడి... టీమిండియా స్టార్లకు సినిమా పేర్లు, ఎవరికేం ఇచ్చాడంటే..

Published on Sun, 03/19/2023 - 17:33

నాని హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచేశాడు ఈ నేచురల్‌ స్టార్‌. ఇప్పటికే ముంబైతో సహా పలు నగరాల్లో ప్రచారం చేశాడు. ఇక తెలుగులో అయితే వరుసగా ప్రేస్‌ మీట్స్‌ నిర్వహిస్తూ ‘దసరా’ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి తెగ కష్టపడుతున్నాడు.

సినిమా ప్రమోషన్స్‌కి స్కోప్‌ ఉన్న ఏ చిన్న చాన్స్‌ని కూడా నాని మిస్‌ చేసుకోవడం లేదు. తాజాగా విశాఖపట్నం వెళ్లిన నాని.. అక్కడ భారత్‌,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాజీ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌, ఎమ్మెస్కే ప్రసాద్‌, ఆరోన్‌ పించ్‌తో కాసేపు ముచ్చటించాడు.

ఆరోన్‌ పించ్‌తో ‘దసరా’లోని ధూమ్‌ ధామ్‌ సిగ్నేచర్‌ స్టెప్‌ వేయించాడు. అనంతరం తెలుగు కామెంటరీ టీమ్‌తో మాట్లాడుతూ.. భారత క్రికెటర్లకు సినిమా టైటిల్స్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ‘జెంటిల్‌మెన్‌’ అని, విరాట్‌కొహ్లీకి ‘గ్యాంగ్‌ లీడర్‌’ అని, హర్దిక్‌ పాండ్యకి ‘పిల్ల జమిందార్‌’ పేర్లు పెట్టాడు. ఇక తనకు ఇష్టమైన క్రికెటర్‌ సచిన్‌ అని.. ఆయన ఔట్‌ అని తెలియగానే టీవీలు ఆపేసేవాళ్లమని నాని చెప్పుకొచ్చాడు.

ఇక ‘దసరా’ విషయాకొస్తే..  శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌.  సాయికుమార్‌, సముద్రఖని, జరీనా వహబ్‌, దీక్షిత్ శెట్టి, మాలీవుడ్ యాక్టర్‌ షైన్‌ టామ్‌ చాకో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి దసరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించారు. మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలవుతుంది.

Videos

Amjad: జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. బాబుకి చెమటలు పడుతున్నాయి

వెయ్యి మందికిపైగా YSRCP నేతలకు నోటీసులిచ్చారు: అనిల్ కుమార్ యాదవ్

దయచేసి బెట్టింగ్‌ యాప్‌ల్లో ఆడకండి: ప్రకాష్‌రాజ్‌

ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుంది :ఫిరోజ్ ఖాన్

దూసుకుపోతున్న నిసార్

హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో సీజ్ చేశామంటున్న డబ్బు నాది కాదు: రాజ్ కేసిరెడ్డి

పులివెందుల ZPTC ఉపఎన్నికకు YSRCP అభ్యర్థి ఖరారు

ఎవ్వడిని వదిలిపెట్టం.. తురకా కిషోర్ అరెస్ట్ పై పేర్ని నాని వార్నింగ్

కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది: జైశంకర్

జగన్‌ను కలిసిన గుత్తా లక్ష్మీనారాయణ

Photos

+5

సార్.. మేడమ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిత్యామీనన్.. (ఫోటోలు)

+5

'కింగ్డమ్' రిలీజ్ ప్రెస్‌మీట్.. విజయ్ ఇలా భాగ్యశ్రీ అలా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో 'జూనియర్' హీరో కిరీటి (ఫొటోలు)

+5

30 దేశాల‍కు సునామీ టెన్షన్‌.. ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు లక్షలాది ప్రజలు (ఫొటోలు)

+5

రుచికీ, ఆరోగ్యాని​కీ పేరుగాంచిన వంటకం! (ఫొటోలు)

+5

మీకు తెలియకుండానే మీ పాన్‌కార్డుతో లోన్‌! ఎలా తెలుసుకోవాలంటే..(ఫొటోలు)

+5

తేళ్లు కుట్టని పంచమి.. పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

భారతదేశంలోని ప్రసిద్ధ నరసింహ పీఠాలు (ఫొటోలు)

+5

నిధి అగర్వాల్‌.. విచిత్రమైన కండీషన్‌ (ఫొటోలు)

+5

ఒక ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు..? ( ఫోటోలు )