Breaking News

కళ్లు తెరిపించేలా...

Published on Fri, 06/19/2026 - 00:57

‘‘సాధారణ ప్రజలు ప్రతి రోజూ వినియోగించే ఆహార పదార్థాల వెనక దాగి ఉన్న ప్రమాదాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ఈ అంశంపై సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నంగా ‘ది ఇండియా స్టోరీ’ సినిమాను తెరకెక్కించాం’’ అని పేర్కొన్నారు డీకే చేతన్‌. కాజల్‌ అగర్వాల్, శ్రేయాస్‌ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది ఇండియా స్టోరీ. డీకే చేతన్‌ దర్శకత్వంలో జీ స్టూడియోస్‌ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్‌ అండ్‌ స్టూడియోస్‌ సహకారంతో సాగర్‌ బి. షిండే నిర్మించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

ఈ సినిమా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ముంబై హైకోర్టు నేపథ్యంలో సాగే కోర్టు రూమ్‌ డ్రామా ఇది.  గురువారం ఈ సినిమా అధికారిక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో కాజల్‌ చేతిలో ఉన్న ఫైల్‌పై క్యాన్సర్‌ ఫైల్స్‌ అని కనిపిస్తోంది. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ న్యాయవాది పాత్రలో కనిపిస్తారు.

‘‘ఆహార కల్తీ కారణంగా కుటుంబ సభ్యులు, కావాల్సినవారిని కోల్పోయిన ప్రతి భారతీయుడి కథే ఈ సినిమా. మన సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఆహార కల్తీ ఒకటి. మనందరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశం ఇది. ఈ సినిమాలో ఉన్న బలమైన సందేశం ప్రతి ఒక్కరి కళ్లు తెరిపించేలా ఉంటుంది. ప్రతి రోజూ తాము తీసుకునే ఆహారం విషయంలో మరింత అవగాహనతో ఉండాలని ప్రేరేపిస్తుందని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు చేతన్‌ డీకే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)