కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
దుకాణాల ముందు నిలబడి అడుక్కునేవాళ్లం : ఇళయరాజా
Published on Sat, 10/17/2026 - 14:05
సంగీత దర్శకుడు ఇళయరాజా ఇప్పుడు కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో సంగీత వీణను మీటే ఆరాధ్యుడు అనే చెప్పాలి. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన ఆర్థికంగా బాగా బలపడ్డారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సంగీత జ్ఞాని ఆరంభ జీవితం గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా జెన్ జీ తరానికి తెలిసే అవకాశమే లేదు. కడు పేదరికంంలో పెరిగారు ఆయన. హార్మోణి పెట్టే భుజాన వేసుకుని గ్రామాల్లో పాటలు పాడుకుంటూ పొట్టబోసుకున్నారు. చైన్నెకి చేరుకున్న తర్వాత కూడా గుప్పెడు కడుపు నింపుకోవడానికి పలుపాట్లు పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఇళయరాజా వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు.
‘‘నేను చైన్నెకి వచ్చిన 1958 ప్రాంతంలో నవరాత్రి ఉత్సవాల సమయంలో తినడానికి కూడా కష్టపడ్డాం. నేను, భాస్కర్ (సోదరుడు), దర్శకుడు భారతీరాజా మూడు రాత్రులు పస్తులు ఉన్నాం. అలాంటి సమయంలో స్థానిక వడపళనిలోని ఆలయం ఎదురుగా దుకాణాల్లో పూజులు చేసి అటుకులు, మరమరాలు, పప్పు బెల్లాలు పంచేవారు. నేను, భాస్కర్, భారతీరాజా ప్రతి దుకాణం ముందు వరుసలో నిలబడి వాటిని తీసుకెళ్లి రూమ్లో ఒక పేపర్పై వేసి తింటూ రోజులు గడిపాం. ఆ తర్వాత ఈ విషయాన్ని నా భార్యకు చెప్పాను. ఆమె నవరాత్రుల సమయాల్లో పలువురిని పిలిచి పులిహోర, పెరుగు అన్నం పొట్లాలను పంచుతూ వచ్చారు.
ఆ తర్వాత పలువురు సంగీత కచ్చేరిలను నిర్వహించినప్పుడు సంగీత కళాకారులకు భోజనాలు పెట్టడం ఆనవాయితీగా మారింది. దీన్ని ప్రచారం చేసుకోవాలని కాదు గానీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎవరూ పస్తులు ఉండకూడదు అనే అలా చేసేవాళ్లం’’ అని ఇళయరాజా పేర్కొన్నారు.
Tags : 1