Breaking News

సన్నీడియోల్ ‘ఇక్కా’ మూవీ రివ్యూ

Published on Fri, 07/17/2026 - 17:03

ఉన్నావాడికైనా, లేనివాడికైనా , ఎవ్వరికైనాసరే ఉండేది స్వార్ధం. ఈ సమాజంలో జరుగుతున్న వందశాతం నేరాలు స్వార్ధంతో చేసేవే. అటువంటి నేరాలకు కొమ్ము కాస్తూ అన్యాయంగా న్యాయాన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్న వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పిన ఆటే ఈ ఇక్కా. తెలుగులో ఇక్కా అంటే పేకాటలో  వచ్చే ఆసు ముక్క అని అర్ధం.

 పేకాటలో ఆసు ముక్కకు ఎంత యుక్తి శక్తి ఉందో అంతకంటే వందలరెట్లు తెలివిగలవాడు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో వచ్చే పాత్రలు, చేసే పనులన్నీ చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు కాస్త విజ్ఞానాన్ని కూడా అందిస్తుదనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కా సినిమా ప్రేక్షకులకు కనువిందుతో పాటు కనువిప్పు కూడా కలిగిస్తుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం.

సోమా మిట్టల్ అనే యువతి ప్రముఖ వ్యాపారవేత్త శౌర్యమాన్ గౌర్ కారు నుండి విసిరివేయబడి దారుణ హత్యకు గురవుతుంది. అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు శౌర్యమాన్ గౌర్ ను అరెస్ట్ చేస్తారు. శౌర్యమాన్ తండ్రి పెద్ద రాజకీయనాయకుడు కావడం వల్ల నగరంలోని ప్రముఖ లాయర్ అయిన అర్జున్ మెహరాను ఈ కేసు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తారు. కాని న్యాయానికి కట్టుబడ్డ అర్జున్ మెహరా ముందు ఈ కేసును తీసుకోనని ససేమిరా తిరస్కరిస్తాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కేసును అర్జున్ మెహరా శౌర్యమాన్ తరపున వాదించడానికి ఒప్పుకుంటాడు. తన జీవిత కాలంలో న్యాయనికి కట్టుబడ్డ అర్జున్ మెహరా మొట్టమొదటిసారిగా అన్యాయం తరపున వకాల్తా పుచ్చుకోవడం మొత్తం కోర్టు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. 

అన్యాయం వైపు నిలబడ్డ అర్జున్ మెహరా న్యాయం కోసం తన ఆసు ముక్కని ఎలా ఆడతాడో ఇక్కా సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ మండి డ్రమెటిక్ థ్రిల్లర్.అల్తియా కౌశల్ అందించిన ఇక్కా కథను ప్రముఖ దర్శకుడు సిద్ధార్ధ మల్హోత్రా తెరకెక్కించారు. ప్రముఖ నటులు సన్నీడియోల్, అక్షయ్ ఖన్నా తో పాటు దియా మర్జా వంటి వర్ధమాన తారలు ఈ ఇక్కా సినిమాలో తమ పాత్రలకు పక్కా న్యాయం చేశారు.విశేషంగా సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఈ ఇక్కా సినిమా మాతృక హిందీ అయినా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోను లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ప్లే జాయ్ ఫుల్లీ విత్ యువర్ ఇక్కా.
-హరికృష్ణ ఇంటూరు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)