Breaking News

అన్యాయం ఆడే ఆటలో న్యాయం పక్కా...

Published on Fri, 07/24/2026 - 04:41

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ఇక్కా ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఉన్నవాడికైనా, లేనివాడికైనా, ఎవ్వరికైనా సరే ఉండేది స్వార్థం. ఈ సమాజంలో జరుగుతున్న వంద శాతం నేరాలు స్వార్థంతో చేసేవే. అటువంటి నేరాలకు కొమ్ము కాస్తూ అన్యాయంగా న్యాయాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్న వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పిన ఆటే ఈ ‘ఇక్కా’. తెలుగులో ఇక్కా అంటే పేకాటలో వచ్చే ఆసు ముక్క అని అర్థం. పేకాటలో ఆసుకు ఎంత యుక్తీ శక్తీ ఉందో అంతకంటే వందల రెట్లు తెలివిగలవాడు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో వచ్చే పాత్రలు, చేసే పనులన్నీ చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు కాస్త విజ్ఞానాన్ని కూడా అందిస్తాయనడంలో సందేహం లేదు.

ఇంకా చెప్పాలంటే ‘ఇక్కా’ సినిమా ప్రేక్షకులకు కనువిందుతో పాటు కనువిప్పు కూడా కలిగిస్తుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో చూద్దాం... ప్రముఖ వ్యాపారవేత్త శౌర్యమాన్‌ గౌర్‌ కారు నుండి విసిరి వేయబడి సోమా మిట్టల్‌ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు శౌర్యమాన్‌ గౌర్‌ను అరెస్ట్‌ చేస్తారు. శౌర్యమాన్‌ తండ్రి పెద్ద రాజకీయ నాయకుడు కావడం వల్ల నగరంలోని ప్రముఖ లాయర్‌ అయిన అర్జున్‌ మెహరాను ఈ కేసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తారు. కానీ న్యాయానికి కట్టుబడిన అర్జున్‌ మెహరా ముందు ఈ కేసును తీసుకోనని ససేమిరా తిరస్కరిస్తాడు.

అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల శౌర్యమాన్‌ తరపున కేసును వాదించడానికి అర్జున్‌ మెహరా ఒప్పుకుంటాడు. తన జీవిత కాలంలో న్యాయనికి కట్టుబడిన అర్జున్‌ మెహరా మొట్టమొదటిసారిగా అన్యాయం తరపున వకాల్తా పుచ్చుకోవడం మొత్తం కోర్టు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అన్యాయం వైపు నిలబడ్డ అర్జున్‌ మెహరా న్యాయం కోసం తన ఆసుని ఎలా ఆడతాడో ‘ఇక్కా’ సినిమాలోనే చూడాలి.

ఈ సినిమా ఓ మంచి డ్రమెటిక్‌ థ్రిల్లర్‌. అల్తియా కౌశల్‌ అందించిన ‘ఇక్కా’ కథను ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా తెరకెక్కించారు. సన్నీ డియోల్, అక్షయ్‌ ఖన్నా, దియా మీర్జా ఈ సినిమాలోని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. ఈ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌. ప్లే జాయ్‌ ఫుల్లీ విత్‌ యువర్‌ ‘ఇక్కా’.            
– హరికృష్ణ ఇంటూరు  

#

Tags : 1

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)