Breaking News

నంద్యాల మాజీ ఎమ్మెల్యే ట్వీట్‌కు బన్నీ రిప్లై .. అదేంటో తెలుసా?

Published on Thu, 11/21/2024 - 12:17

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను కకావికలం చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యంత వేగంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ మూవీ కూడా ఇలాంటి రికార్డ్ సాధించలేదు.

అయితే అల్లు అర్జున్‌కు, నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రవికి మద్దతు తెలిపారు. తన ఫ్యామిలీతో కలిసి స్వయంగా నంద్యాలకు వెళ్లి రవిని కలిశారు. ఆ సమయంలోనే అల్లు అర్జున్‌ నిబంధనలు పాటించలేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం ఈ  కేసును కొట్టివేసింది.

తాజాగా పుష్ప 2 రిలీజ్‌ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ మూవీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శిల్పారవి పోస్ట్ చేశారు. థియేటర్లలో వైల్డ్‌ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప 2 టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ చెప్పారు.

శిల్పా రవి చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్‌ స్పందించారు. థ్యాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. వీరిద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)