Breaking News

డైరెక్షన్‌ ఆలోచన ఉంది

Published on Thu, 04/27/2023 - 01:18

‘‘ఏజెంట్‌’ ఒక యాక్షన్‌ ఫిల్మ్‌. ముగ్గురు ఏజెంట్స్‌ మధ్య జరిగే కథ ఇది. కథ భిన్నంగా ఉంటుంది. భావోద్వేగాలు కూడా బలంగా ఉంటాయి. అఖిల్‌ కెరీర్‌లో ‘ఏజెంట్‌’కి ముందు, ‘ఏజెంట్‌’కి తర్వాత అనేలా ఉంటుంది. విజువల్స్‌ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత అనిల్‌ సుంకర అన్నారు. అఖిల్‌ అక్కినేని, సాక్షీ వైద్య జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్‌ సుంకర మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యంగ్‌ హీరోలు డూప్‌ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌కి చెప్తాను.

ఈ మధ్య విజయవాడలో జరిగిన ప్రమోషనల్‌ ఈవెంట్‌లో అఖిల్‌ దాదాపు 170 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. రోప్స్‌ కట్టినప్పటికీ రిస్క్‌ ఎందుకని నేను వద్దన్నాను. అయితే అఖిల్‌ చేస్తానన్నాడు. క్రెడిట్‌ అంతా తనకే దక్కుతుంది. ‘ఏజెంట్‌’లో ప్రేక్షకులు ఇలాంటి సాహసాలు చాలా చూస్తారు. ఇది భారీ స్పాన్‌ ఉన్న సినిమా. ఇందులో గంటన్నర కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ఉంటాయి. అందుకే  చాలా సమయం పట్టింది.

‘ఏజెంట్‌’ని ముందు తెలుగులో రిలీజ్‌ చేసి, రెండో వారం నుంచి ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. హిందీలో ఇప్పటికే డబ్బింగ్‌ పూర్తయింది. నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. నా డైరెక్షన్‌లో స్పై జోనర్‌లో సినిమా ఉంటుంది. మా 14 రీల్స్‌ బ్యానర్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్‌ అనౌన్స్‌మెంట్స్‌ ఉంటాయి. ప్రస్తుతం చిరంజీవిగారితో నిర్మిస్తున్న ‘భోళా శంకర్‌’ సినిమా యాక్షన్‌ సీన్స్‌ జరుగుతున్నాయి. ఆగస్ట్‌ 11న ఈ సినిమా విడుదలకి డేట్‌ ఫిక్స్‌ చేశాం’’ అన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)