Breaking News

ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్‌ ఇచ్చిన ఇళయరాజా!

Published on Sun, 05/19/2024 - 09:50

తమిళసినిమా: ఇతరుల గురించి పట్టించుకోవడం తన పని కాదని, అంత తీరిక కూడా తనకు లేదని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇటీవల ఈయన పేరు  నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్‌ కోరుతున్న విషయం విధితమే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటీవల తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని కాపీ కొట్టారంటూ సన్‌ పిక్చర్స్‌ సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారు. 

అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా గురువారం ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు. 

తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇళయరాజా జూలై 14న భారీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక నందనంలోని వీఎంసీఏ గ్రౌండ్‌లో జరగనున్న ఈ సంగీత విభావరిలో ఇళయరాజా కనీసం 50 నుంచి 60 పాటలు పాడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)