Breaking News

నేను పెళ్లి చేసుకోలేదు: మెహరీన్‌

Published on Wed, 12/17/2025 - 01:39

‘‘నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ  వివాహం కాలేదు’’ అంటూ హీరోయిన్‌ మెహరీన్‌ స్పష్టం చేశారు. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’(2016) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు మెహరీన్‌. ఆ తర్వాత ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ వంటి పలు హిట్‌ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు మెహరీన్‌. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనుకున్నారంతా.

ఆ తర్వాత ఆ నిశ్చితార్థం రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మెహరీన్‌ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ న్యూస్‌పై మోహరీన్‌ స్పందించి, సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నానంటూ కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో ఆర్టికల్స్‌ వచ్చాయి. అందులోనూ నాకు తెలియని, ఎప్పుడూ కలవని  వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని రాశారు.

నా వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్‌ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ప్రయత్నించిన ఒక నీచుడి పని ఇది. నా వివాహం విషయంలో రెండేళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో నిజం చెప్పక తప్పలేదనిపించింది. నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు.. నన్ను నమ్మండి. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెబుతాను.. ప్రామిస్‌’’ అంటూ పేర్కొన్నారు మెహరీన్‌. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)