'పుష్ప' విలన్‌పై సుమోటో కేసు.. అసలేం జరిగిందంటే?

Published on Sat, 06/29/2024 - 08:06

ఫహాద్ ఫాజిల్ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ 'పుష్ప' విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా చివర్లో 'పార్టీ లేదా పుష్ప' అని హంగామా చేసే ఇతడు స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి హిట్ కొడుతున్నాడు. రీసెంట్‌గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇతడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు కూడా బుక్ చేసింది.

ఇంతకీ ఏమైంది?
మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు చేస్తున్నారు. అలా ప్రస్తుతం 'పింకేలీ' షూటింగ్‌ని అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో చిత్రీకరించారు. గురువారం రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎమర‍్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతో పాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. అసలు అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

(ఇదీ చదవండి: ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా?)

ఓవైపు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నప్పుడే మరోవైపు షూటింగ్ కూడా చేశారని, దీని వల్ల రోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పలువురు పేషెంట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మాతల సంఘం మాత్రం ఆరోపణల్ని కొట్టేసింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని చెప్పుకొచ్చింది.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం.. నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు పెట్టింది. దీంతో ఇతడు త్వరలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏమవుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)