Breaking News

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై హెబ్బా పటేల్‌ 'హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌'

Published on Tue, 08/27/2024 - 12:41

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన కొత్త చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్'. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. జూన్‌ 21న విడుదలైన ఈ సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.  రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు నటించారు.

ప్రస్తుత సమాజంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్‌లో కాస్త పర్వాలేదు అనేలా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, సడెన్‌గా 'హనీమూన్ ఎక్స్ ప్రెస్' ఓటీటీలోకి వచ్చేసి షాకిచ్చింది. సడెన్‌గా నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. చైతన్య రావు, హెబ్బా పటేల్ మధ్య వచ్చే సీన్స్‌ కాస్త నెగటివ్‌ను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. అయితే, ఈ చిత్రానికి ఐఎండీబీలో 8.7 రేటింగ్‌ ఉన్నటం విశేషం.

కథేంటంటే..
వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్‌), ఈషాన్‌(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్‌ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌(రిస్టార్ట్‌) గురించి చెబుతుంది. 

ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌  కాన్సెప్ట్‌ ఏంటి?  ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్‌  శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు