Breaking News

హారర్ థ్రిల్లర్‌ ‘హనీ’ మూవీ రివ్యూ

Published on Fri, 02/06/2026 - 19:05

టైటిల్‌: హనీ
నటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రి
నిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి
రచన, దర్శకత్వం: కరుణ కుమార్
సంగీతం:  అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: నగేష్‌ బన్నెల్‌
ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్
విడుదల తేది: ఫిబ్రవరి 6, 2025

కథేంటంటే..
ఆనంద్‌(నవీన్‌ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్‌ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్‌ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసంతో దుర్మార్గపు, అమానవీయ చర్యలకు పాల్పడే మనుషులు ఉన్నారు. క్షుద్రపూజల కోసం సొంత మనుషులనే చంపుకున్న సంఘటనలు ఉన్నాయి.  అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘హనీ’. .‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మూఢనమ్మకాల పిచ్చితో కట్టుకున్న భార్యని, కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసే ఓ చీకటి మనిషి కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో టచ్‌ చేసిన పిల్లి మాయ కాన్సెప్ట్‌ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మదనపల్లె సహా పలు నిజ జీవిత క్షుద్ర పూజల సంఘటనల్ని గుర్తొస్తాయి. ఎక్కడా అనవసరమైన భయపెట్టే సీన్స్ లేకుండా, సిచ్యుయేషన్స్ ద్వారానే టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.

కొండగుహలో ఓ తెగ క్షుద్ర దేవతను ఆరాధించే ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అలాంటి క్షుద్రపూజలే హీరో ఆఫీస్‌లో చేయడంతో అతన్ని చితక్కొట్టి.. బయటకు పంపిస్తారు. ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. అతనికున్న పిచ్చితో కూతురు, భార్య పడే ఇబ్బందులు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇక ఫ్యామిలీతో కలిసి ఊరి బయట ఉన్న ఇంట్లోకి వెళ్లిన తర్వాత.. కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పిల్లి మాయ సేకరణ సీన్‌ థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ ఇచ్చినా, క్లైమాక్స్  ఆకట్టుకుంటుంది. ద్వితియార్థం కథని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
ఆనంద్ పాత్రలో నవీన్‌ చంద్ర ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల కంటి చూపుతోనే భయపెట్టాడు. లలిత పాత్రలో దివ్య పిళ్లై అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన హృదయాలను హత్తుకుంటుంది. మీరా పాత్రలో కనిపించిన చిన్నారి సహజ నటనతో ఆకట్టుకుంది. రమణగా దివి చేసిన బోల్డ్ రోల్ సినిమాకు ఇంకో డార్క్ షేడ్ ఇచ్చింది. సారంగపాణిగా రాజా రవీంద్ర తనదైన ముద్ర వేశాడు.

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌.  కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ కథకు బలంగా నిలుస్తాయి. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- రేటింగ్‌: 3/5

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)