Breaking News

దర్శకధీరుడిపై మరోసారి ప్రశంసలు.. హాలీవుడ్ దిగ్గజం ఏమన్నారంటే?

Published on Wed, 02/07/2024 - 15:39

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతే కాదు.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డ్‌ను గెలిచి మన గొప్పదనాన్ని మరింత పెంచారు. గతేడాది లాస్‌ ఎంజిల్స్‌ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్‌ చిత్రానికి అవార్డ్ దక్కింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది. 

ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్ సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో కామెరూన్‌ను రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారు.

(ఇది చదవండి: 'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్‌ కూతురు ఆసక్తికర కామెంట్స్!)

తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు.  ఈవెంట్‌లో ఓ మీడియా ప్రతినిధి ‍అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్పగా విషయం' అని  అన్నారు. 

తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్‌ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)