Breaking News

హలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్‌ అరుదైన పురస్కారం

Published on Sat, 05/04/2024 - 13:15

హాలీవుడ్‌ ప్రముఖ నటి మెరిల్‌ స్ట్రీప్‌ ఆనందంలో ఉన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్‌లో 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన పామ్‌ డి ఓర్‌ గౌరవ పురస్కారానికి మెరిల్‌ స్ట్రీప్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమె ఆనందానికి కారణం ఇదే. 

ఈ ఏడాది మెరిల్‌ స్ట్రీప్‌కు, జపాన్‌కు చెందిన యానిమేషన్‌ ‘స్టూడియో ఘిబ్లి’ నిర్వాహకులకు, హాలీవుడ్‌ దర్శక–నిర్మాత జార్జ్‌ వాల్టన్‌ లూకాస్‌ జూనియర్‌ (స్టార్‌ వార్స్, ఇండియానా జోన్స్‌’ ఫేమ్‌)కు పామ్‌ డి ఓర్‌ పురస్కారాన్ని అందజేస్తారు. 

ఈ సందర్భంగా మెరిల్‌ స్ట్రీప్‌ మాట్లాడుతూ – ‘‘ఈ  అవార్డుకు ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. అంతర్జాతీయ నటీనటులు, ఫిల్మ్‌ మేకర్స్‌ భాగాస్వామ్యులైన కాన్స్‌ వేదికగా నేను ఈ అవార్డును గెలుచుకోవడం అనేది ఫిల్మ్‌ మేకింగ్‌ రంగంలో నాకు దక్కిన ఓ అద్భుత విజయంగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. గతంలో హాలీవుడ్‌ స్టార్స్‌ టామ్‌ క్రూజ్, మైఖేల్‌ డగ్లస్, హారిసన్‌ ఫోర్డ్‌ వంటివారికి పామ్‌ డీ ఓర్‌ అవార్డు దక్కింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)