Breaking News

తెలిసిన వ్యక్తే అని వెెళ్తే.. లైంగిక దాడి చేశాడు: నటి

Published on Sat, 01/21/2023 - 15:51

హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ అమెరికన్ మోడల్. ఆమె పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో తన కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల విడుదలైన కొత్త డాక్యుమెంటరీ 'ప్రెట్టీ బేబీ'లో ఆమెపై జరిగిన లైంగిక దాడి సంఘటనను వివరించారు. అయితే నటిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఆమె ఆ వ్యక్తిని అంతకుముందే కలిసినట్లు చెప్పింది. గ్రాడ్యుయేషన్  చదివేటప్పుడు తెలిసిన వ్యక్తేనని వివరించింది.  చిన్న వయసులోనే మోడల్‌గా ఫేమస్ అయిన బ్రూక్ షీల్డ్స్ ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో చదివారు.

బ్రూక్ షీల్డ్స్‌కు తెలిసిన వ్యక్తి టాక్సీ పిలుస్తానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడని పేర్కొంది. ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత బాత్రూమ్‌కు వెళ్లి అదృశ్యమయ్యాడని ఆమె చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని వెల్లడించింది.

బ్రూక్ షీల్డ్ మాట్లాడుతూ.. ' ఆ సమయంలో నేను అతనిపై ఫైట్‌ చేయలేకపోయా. పూర్తిగా స్తంభించిపోయా. కేవలం 'నో' అని మాత్రమే అరిచా. ఆ సమయంలో కేవలం ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నా.' అని వివరించింది. ఈ సంఘటన తర్వాత తన స్నేహితుడు, సెక్యూరిటీ హెడ్ గావిన్ డి బెకర్‌కు ఫోన్ చేసినట్లు గుర్తుచేసుకుంది. కాగా.. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించబడిన కొత్త డాక్యుమెంటరీ "ప్రెట్టీ బేబీ'ని ప్రదర్శించారు. 

.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)