Breaking News

హంటర్‌ వస్తున్నాడు

Published on Sun, 12/22/2024 - 00:06

హాలీవుడ్‌ నటుడు ఆరోన్‌ టేలర్‌ జాన్సన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రావెన్‌: ది హంటర్‌’. అరియానా డిబోస్, ఫ్రెడ్‌ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్‌ అబాట్, రస్సెల్‌ క్రోవ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం ఈ నెల 13న అమెరికాలో విడుదలైంది. అవి అరద్‌ , మాట్‌ టోల్మాచ్, డేవిడ్‌ హౌస్‌హోల్టర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ రిలీజ్‌ చేసింది. అలాగే ‘క్రావెన్‌: ది హంటర్‌’ సినిమాను 2025 జనవరి 1న ఇండియాలో ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ చేసేందుకు సోనీ పిక్చర్స్‌ సంస్థ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. కాగా క్రావెన్‌ రోల్‌కి తాను ప్రిపేర్‌ అయిన విధానం గురించి టేలర్‌ జాన్సన్‌ మాట్లాడుతూ – ‘‘మార్వెల్‌ కామిక్‌ బుక్స్‌లో కనిపించే క్రావెన్‌ క్యారెక్టర్‌నే ఆడియన్స్‌ అందరూ స్క్రీన్‌పై కూడా చూడాలనుకుంటున్నారు.

సో... ఈ క్యారెక్టర్‌ కాస్ట్యూమ్స్‌కి తగ్గట్లుగా నా గెటప్‌ను రెడీ చేసుకోవాలనుకున్నాను. ఇందుకు బాడీ ట్రాన్స్‌ఫార్మ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాను. కానీ ఇదేమీ అంత సులభమైన పని కాదు. కానీ మేం ఆరు నెలలో చేశాం’’ అని తెలిపారు. ‘‘చాలా చాలెంజ్‌లను ఫేస్‌ చేశాం. మొబైల్‌ జిమ్‌ను ఉపయోగించేవాళ్లం. ఎక్కువ ట్రైనింగ్‌ వల్ల మజిల్‌ డ్యామేజ్‌ అవుతుందని, కొన్ని ప్రత్యేకమైన వర్కౌట్స్‌ మాత్రమే చేశాం’’ అని తెలిపారు ఫిజికల్‌ ట్రైనర్‌ కింగ్స్‌ బరీ.

ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రావినోఫ్‌ (రస్సెల్‌ క్రోవ్‌) ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌. కొన్ని పరిణామాల వల్ల క్రావెన్‌ కూడా కొన్ని క్రూరమైన పరిణామాలతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను ప్రపంచంలోనే గొప్ప హంటర్‌గా మారడమే కాకుండా అందరూ భయపడే వ్యక్తిగా ఎలా మారాడు? అన్నదే కథ.

#

Tags : 1

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)