Breaking News

మరో ఓటీటీలో క్రైమ్‌ సస్పెన్స్‌ సినిమా స్ట్రీమింగ్‌

Published on Sun, 02/23/2025 - 08:01

అశ్విన్‌ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హిడింబ’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయతే, అమెజాన్ ప్రైమ్‌లో కూడా తెలుగు వెర్ష‌న్‌లోనే హిడింబ మూవీ తాజాగా విడుద‌లైంది.

ప్రముఖ యాంక‌ర్ ఓంకార్ సోద‌రుడిగా అశ్విన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజుగారి గ‌ది సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ చిత్రాలన్నింటికి ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. అయితే, హిడింబ చిత్రాన్ని అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై భారీ అశలు పెట్టకున్న మేకర్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే, కలెక్షన్స్‌ పరంగా ఫర్వాలేదనిపించింది. అనుకున్న టార్గెట్‌ రీచ్‌ కావాడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద బ్రేక్ ఈవెన్‌గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

కథేంటి..?
హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్‌ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్‌(అశ్విన్‌ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్‌ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్‌ రిస్క్‌ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. 

అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్‌ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్‌ డ్రెస్‌ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్‌ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్‌ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)