Breaking News

ఇంటి పనంతా మాతోనే.. ప్రశ్నిస్తే ‘మేం మగాళ్లం’ అనేవాళ్లు: స్నేహ

Published on Wed, 05/31/2023 - 13:00

గత దశాబ్దంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన స్నేహ బాల్యంలో ఎన్నో ఛీత్కారాలను, వేదనలను అనుభవించారట. ఈ విషయాన్ని తనే ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. వివరాలు..ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఎన్నవళే అనే చిత్రంతో మాధవన్‌కు జంటగా కోలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. ఆ తరువాత 2001లో ఆనందం చిత్రంలో అబ్బాస్‌కు జంటగా నటించారు. ఆ చిత్రం 200 రోజులు ఆడింది.

అదే విధంగా తెలుగులోనూ పలు చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తమిళంలో కమలహాసన్, సూర్య, ధనుష్‌, విజయ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించిన ప్రముఖ కథానాయకిగా రాణించారు. అలా ప్రముఖ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే  2012లో నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

ఇంతవరకు స్నేహ గురించి చాలామందికి తెలిసిందే. అయితే ఆమె కుటుంబం, బాల్యం గురించి ఎవరికీ చెప్పలేదు. అలాంటిది తొలిసారిగా ఇటీవల ఒక భేటీలో తాను బాల్యంలో అనుభవించిన కష్టాల గురించి ఏకరువు పెట్టారు. తన తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు అని చెప్పారు. కూతుర్లలో తాను చివరి దానినని, తనకు బదులు కొడుకు పుట్టాలని తన బామ్మ గట్టిగా కోరుకుందని దీంతో ఆమె తన ముఖాన్ని చూడటానికి మూడు రోజుల వరకు ఇష్టపడలేదని తెలిపారు. ఇక చిన్నతనంలో మంచి నీళ్లు పక్కనే ఉన్నా వాటిని.. సోదరులకు తామే అందించాల్సి వచ్చేదన్నారు. అదేమని ప్రశ్నిస్తే మేం మగాళ్లం. ఆడపిల్లలైన మీరే ఇంటి పనులు చేయాలని కండీషన్లు పెట్టేవారని వాపోయింది. ముఖ్యంగా తన పెద్ద సోదరుడు తనను చాలా ఇబ్బందులు పెట్టేవాడని, అన్ని పనులు తననే చేయమని ఆదేశించేవాడని పేర్కొంది.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)