'తెలుగు ఆడియన్స్‌ మాత్రమే అలా చేస్తారు'.. సాయిపల్లవి కామెంట్స్

Published on Wed, 11/06/2024 - 19:16

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్  వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ మూవీ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్‌పై ప్రశంసలు కురిపించారు. భాషతో సంబంధం లేకుండా ఆదరించేది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమేనన్నారు. గతంలో నన్ను భానుమతి, వెన్నెల అని పిలిచేవారు.. ఇప్పుడేమో ఇందు రెబెకా వర్గీస్ అని పిలుస్తున్నారు. సినిమాను గొప్పగా ప్రేమించే ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగువారు మాత్రమేనని సాయిపల్లవి కొనియాడారు. మీ ప్రేమ, ఎంకరేజ్‌మెంట్‌ చూసి నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలని అనిపిస్తోందని ‍అన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్‌ అంటూ సాయిపల్లవి మాట్లాడారు.

కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్‌ ‍అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)