Breaking News

దయచేసి సినిమాల్లోకి రాకండి.. విశాల్‌ కీలక వ్యాఖ్యలు

Published on Thu, 01/30/2025 - 13:33

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌(Vishal) చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్థితి బాగోలేదని..సినిమాలు నిర్మించి డబ్బును వృథా చేయకండి అని కోరారు. డబ్బులు ఉన్నవారు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలన ఇలాంటి మాటలు చెబితే తనను విలన్‌గానే చూస్తారని.. అయినా కూడా తాను చెప్పేస్తున్నానని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితుల గురించి గతంలోనే నేను మాట్లాడాను. పరిస్థితి బాగోలేదని చెబితే అందరూ నన్ను విలన్‌లా చూశారు. కానీ నేను చెప్పిందే వాస్తవం. ఒక చిన్న సినిమా తెరకెక్కించాలన్న కనీసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దయచేసి ఆ డబ్బుని మీ పిల్లల పేరుపై పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. లేదా భూములు కొనండి. అంతేకాని సినిమా రంగంలో పెట్టి నష్టపోకండి. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితుల ఏం బాగోలేవు. డబ్బులు ఉన్నవారు ఎవరైనా సినిమాలు చేయ్యొచ్చు. విజయ్‌ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చు. వారి వద్ద అంత డబ్బు ఉంది. కానీ వాళ్లెందుకు సినిమాలు నిర్మించడం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు’ అని విశాల్‌ అన్నారు. కాగా, గతేడాది కోలీవుడ్‌ భారీగా నష్టాలను చవి చూసింది. ఏడాది మొత్తంలో 240 వరకు సినిమాలు నిర్మిస్తే..వాటిల్లో కేవలం 18 మాత్రమే విజయం సాధించాయి. మొత్తంగా దాదాపు రూ. 1000 కోట్ల నష్టపోయినట్లు తెలుస్తోంది.

మొక్కు చెల్లించిన విశాల్‌..
12 ఏళ్ల క్రితం విశాల్ హీరోగా నటించిన ‘మదగజరాజా'(Madha Gaja Raja) చిత్రం తాజాగా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత విశాల్‌ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. దీంతో బుధవారం విశాల్‌ చెన్నైలోని క‌ప‌లీశ్వ‌ర‌ర్ టెంపుల్‌ సందర్శించి మొక్కులు చెల్లించాడు. 

సినిమా విజయం సాధిస్తే టెంపుల్‌కి వస్తానని మొక్కుకున్నానని.. అనుకున్నట్లే మూవీ హిట్‌ కావడంతో మొక్కులు చెలి​ంచానని విశాల్‌ చెప్పారు.సుందర్ సి  దర్శకతవం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా తమిళ్‌లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)