Breaking News

ప్రపంచాన్నే టాలీవుడ్‌ షేక్‌ చేస్తోంది: ఉపేంద్ర

Published on Tue, 12/17/2024 - 05:12

‘‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను ఇంకా గుర్తుపెట్టుకుని, ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ,ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలనే తపన కలుగుతోంది. ఈ గొప్పదనం అంతా తెలుగు ప్రేక్షకులదే. ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండియానే కాదు... ప్రపంచాన్నే షేక్‌ చేస్తోంది. వెయ్యి కోట్లు, రెండువేల కోట్ల రూపాయల వసూళ్ల సినిమాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ సాధిస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు.

ఉపేంద్ర నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, వీనస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘యూఐ’ రెగ్యులర్‌ సినిమా కాదు. ఓ ఊహాత్మక ప్రపంచంలా ఈ సినిమా కనిపిస్తుంది. ఆడియన్స్‌ ఓ కొత్త సినిమాని ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. మీరు (ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ..) మైథలాజికల్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను చూశారు.

కానీ ‘యూఐ’ సినిమా సైకలాజికల్‌ కల్కి. ‘యూఐ’ సినిమాలోని అంశాలను ఆడియన్స్‌ డీకోడ్‌ చేస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశాను. కేపీ శ్రీకాంత్‌గారికి ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు, ఆయన లహరిలాంటి గొప్ప సంస్థను తీసుకొచ్చారు. ఇక ‘యూఐ’ సినిమాను అల్లు అరవింద్‌గారు తెలుగులో రిలీజ్‌ చేయడాన్ని నేను ఎంతో స్పెషల్‌గా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు రేష్మ. 

ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాతలు ఎస్‌కేఎన్, అంబికా రామచంద్రరావు, ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌ తులíసీ రామ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌ చంద్రు మనోహరన్, కోప్రోడ్యూసర్‌ నవీన్‌ మనోహరన్, డైలాగ్‌ రైటర్‌ పార్థసారథి, లిరిక్‌ రైటర్‌ రాంబాబు గోసాల మాట్లాడి, ‘యూఐ’ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)