Breaking News

మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టం: సుశాంత్‌

Published on Thu, 08/03/2023 - 19:06

‘మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించాలని ప్రతి ఒక్క నటుడికి ఉంటుంది. కానీ కొద్ది మందికి మాత్రమే ఆయనతో  సినిమా చేసే చాన్స్  వస్తుంది. ఆ అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’ అని యంగ్‌ హీరో సుశాంత్‌ అన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సుశాంత్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► చిరంజీవి గారితో పని చేయాలనే ఆలోచనే చాలా ఎక్సయిటింగ్ నాకు. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి రెండు మూడుసార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్  ఫోన్ చేసి ఈ  భోళా శంకర్‌ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవి గారితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను.

► ఈ చిత్రంలో నాది క్యామియో రోల్‌. చిరంజీవి గారు, కీర్తి సురేష్, తమన్నా తో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్ గా చేశాం. కీర్తి సురేశ్‌తో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చిరంజీవి గారితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎక్సయిమెంట్ అనిపించింది. చిరంజీవి గారిలోని ప్రత్యేక ఏమిటింటే .. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. 

► చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ అనగానే కాస్త భయమేసింది. నా బాడీ యీజ్ కోసం శేఖర్ మాస్టర్ టీంతో రెండు గంటలు ప్రాక్టీస్ చేశాను. సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరంజీవి గారు మాత్రం కూర్చొని మైండ్ లో ప్రాక్టీస్ చేసేస్తున్నారు. తమన్నా కీర్తి కూడా మంచి డ్యాన్సర్స్. నలుగురం ఫ్రేమ్ లో వున్నప్పుడు నా మూలంగా స్టెప్ మార్చకూడదు కదా. అందుకే ప్రతి స్టెప్ ని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది. చాలా కలర్ ఫుల్ గా వుంది. సినిమాలో ఈ పాట ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

► కీర్తి అద్భుతమైన నటి. మహానటి సావిత్రి బయోపిక్ తో అందరి మనసులో చెరగని ముద్ర వేశారు. భోళా శంకర్ లో మా కెమిస్ట్రీ  నేచురల్ గా వచ్చింది. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అది మీకు తెరపై కనిపిస్తుంది.

► మెహర్ రమేష్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. దాదాపు మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్ తో ప్రయాణించారు. ఆయనపడిన కష్టం చూశా. చిరంజీవి గారిని ఎలా ప్రజంట్ చేయాలి, అభిమానులని ఎలా అలరించాలి, కొత్తగా ఎలా చూపించాలనే ఆలోచనతో  వుండేవారు. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన కోసం ఈ సినిమా  తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.  

► సోలో హీరోగా రెండు కథల మీద వర్క్ జరుగుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత అనౌన్స్ చేస్తాం.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)