Breaking News

తుపాకులతో బంధించడం కొత్తగా ఉంది: హీరో శ్రీకాంత్‌

Published on Tue, 09/03/2024 - 17:59

ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో  కట్టి  బంధిస్తారు..కానీ ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ పోస్టర్‌లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్‌. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై  బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని హీరో శ్రీకాంత్‌ రిలీజ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో ,  కొత్త ఆలోచనలతో అడుగులేసే  దర్శకుడు బాబ్జీ  ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని  నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.

మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా  ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న  మా  "పోలీస్ వారి హెచ్చరిక”  చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే  నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని శ్రీకాంత్‌ ఆవిష్కరించడం  నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్‌ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు  సన్నీ అఖిల్,  నటి  జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్  యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)