Breaking News

నటుడికి సంతృప్తి అనేది ఉండదు

Published on Thu, 11/23/2023 - 04:40

‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్‌ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్‌.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్‌ అన్నారు. రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ చెప్పిన విశేషాలు.

► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్‌ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్‌ సెటైర్‌ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ.

►ఓ మధ్య తరగతి హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా
ఉంటుంది. నేను హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి.

►దాదాపు 32 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘గేమ్‌ చేంజర్‌’, ఎన్టీఆర్‌తో ‘దేవర’, మోహన్‌లాల్, మా అబ్బాయి రోషన్‌ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్‌ చేస్తున్నాను.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)