నా ప్రతి ప్రయాణంలో వాళ్లు ఉన్నారు: రానా దగ్గుబాటి

Published on Tue, 12/09/2025 - 00:46

‘‘నేను, శరత్, అనురాగ్‌ కలిసి టీవీ షోలు, స్టేజ్‌ ఈవెంట్స్, మూవీ మార్కెటింగ్‌... ఎన్నో చేశాం. నా ప్రతి ప్రయాణంలో వాళ్లు ఉన్నారు. వారు కొత్తగా ప్రారంభిస్తున్న ‘చాయ్‌ షాట్స్‌’ ప్రయాణంలో నేను కూడా ఒక చిన్న భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’’ అని హీరో రానా దగ్గుబాటి తెలిపారు. తెలుగు డిజిటల్‌ ఎంటర్‌టైన్ మెంట్‌లో గత పదేళ్లుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న చాయ్‌ బిస్కెట్‌ సంస్థ తొలి రీజినల్‌ షార్ట్‌ సిరీస్‌ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్‌ షాట్స్‌’ ను నెలకొల్పింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చాయ్‌ షాట్స్‌’ గ్రాండ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత రవి శంకర్‌ మాట్లాడుతూ– ‘‘చాయ్‌ షాట్స్‌’ ఆలోచన చూస్తుంటే మేము కూడా వాళ్లతో భాగం కావాలని ఉంది. ఇందులోని క్రియేటర్స్, యాక్టర్స్‌ త్వరలో బిగ్‌ స్క్రీన్‌కి రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘చాయ్‌ షాట్స్‌’ ని మేము రెండు నెలల క్రితమే లాంచ్‌ చేశాం. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

స్మార్ట్‌ఫోన్‌ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాయ్‌ షాట్స్‌’లో 2 నిమిషాల లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్‌ ఎపిసోడ్లు ఉంటాయి’’ అని చాయ్‌ బిస్కెట్‌ శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీటీవో కృష్ణ, ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్, రెడ్‌ బస్‌ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, డార్విన్ బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రోహిత్‌ చెన్నమనేని, సెంట్రల్‌ క్యాటలిస్ట్‌ రాహుల్‌ హుమాయున్‌ తదితరులు మాట్లాడారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)