Breaking News

‘వీక్షణం’ ప్రీ క్లైమాక్స్‌ ఎవరూ ఊహించలేరు: హీరో రామ్ కార్తీక్

Published on Tue, 10/15/2024 - 17:10

థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ‘వీక్షణం’లో అలాంటి హుక్‌ పాయింట్స్‌ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్‌ ఎవరూ ఊహించలేరు. భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో తెలియజేసే చిత్రమిది’ అన్నారు యంగ్‌ హీరో రామ్‌ కార్తిక్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీక్షణం’. కశ్వి హీరోయిన్‌. మ‌నోజ్ ప‌ల్లేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీరో రామ్‌ కార్తిక్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

⇢ గతేడాది నేను ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి "వీక్షణం" మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ "వీక్షణం" కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి.

⇢ ఈ సినిమాలో నేను సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది.

⇢ నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు.

⇢ ఈ సినిమాలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.

⇢ ప్రస్తుతం వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)