Breaking News

‘పుష్ప’కథతో ‘నరకాసుర’కు సంబంధమే లేదు: హీరో రక్షిత్‌ అట్లూరి

Published on Wed, 11/01/2023 - 16:33

‘నరకాసుర’ మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యం సాగుతుంది. అంతేకానీ పుష్ప మూవీతో ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో​ ఇందులో స్మగ్లింగ్ లాంటివి ఉండవు. పుష్ప కంటే ముందే మా చిత్రం షూటింగ్‌ మొదలైంది. కానీ పలు కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యంగా జరిగి.. రెండున్నర ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ మూవీ కచ్చితంగా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’అని యంగ్‌ హీరో రక్షిత్‌ అట్లూరి అన్నారు.

‘పలాస’లాంటి హిట్‌ మూవీ తర్వాత రక్షిత్‌ అట్లూరి నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు.  ఈ నెల 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో "నరకాసుర" మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంతో హీరో రక్షిత్‌ అట్లూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► పలాస సినిమా రిలీజైన తర్వాత 2020లోనే ‘నరకాసుర’ మూవీ స్టార్ట్‌ చేశాం. ఏడాది సినిమా పూర్తి చేయాలనుకున్నాం. కానీ కోవిడ్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. తర్వాత ఆర్టిస్టులు డేట్స్‌ కుదరలేదు. ఏడాది అనుకున్న సినిమా షూటింగ్ కే రెండున్నర సంవత్సరాల టైమ్ తీసుకుంది.మా డైరెక్టర్‌ గారికి యాక్సిడెంట్ అయి చేయి కోల్పోవడం కూడా డిలేకు కారణం అయ్యింది.

 ►ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ అనే క్యారెక్టర్ లో నటించాను. నాజర్ గారు కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కమ్ పెప్పర్ హార్వెస్టర్ గా కనిపిస్తాను. నా గత సినిమా పలాసలో దళితులకు సంబంధించిన సమస్యలు చూపించినట్లే "నరకాసుర" సినిమాలో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. ఈ ట్రాన్స్ జెండర్స్ అంశం కథలో ఒక సంఘర్షణకు కారణంగా నిలుస్తుంది.

 ►గత మూడు నెలలుగా ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెల 3వ తేది మా సినిమా రిలీజ్ కు మంచి డేట్ అనుకున్నాం. ఎందుకంటే దసరా సినిమాల సందడి కాస్త తగ్గింది. అలాగే పెద్ద సినిమాలేవీ ఈ వారం రిలీజ్ కావడం లేదు. 

►‘నరకాసుర’లో ఒక లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మధ్యప్రదేశ్ లో 20 రోజుల పాటు ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. అక్కడ చలి ఎక్కువ. పైగా రాత్రి పూట వర్షంలో ఆ ఫైట్ సీన్ చేయాల్సివచ్చింది. అప్పుడు కష్టం అనిపించినా...స్క్రీన్ మీద ఔట్ పుట్ చూశాక హ్యాపీగా ఫీలయ్యాం. 

►మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఎందుకంటే పలాస మూవీలో నేను చేసిన యాక్షన్ సీన్స్ చూకున్నప్పుడు ఫైట్స్ బాగా చేశాను అనిపించింది. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పలాస సినిమాలో నాలుగు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించాను అనే పేరొచ్చింది. ఆ పేరు కాపాడుకుంటూ సినిమాలు చేస్తా. పాటలు,  పైట్స్ ఉన్న ఫార్మేట్ లో వెళ్లను.

►నరకాసుర సినిమా చేస్తున్నప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి కానీ నేను ఈ గెటప్ వల్ల చేయలేకపోయాను. పొలిమేర 1 కూడా నేనే చేయాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్స్ చేయలేకపోయినందుకు బాధ లేదు. మా సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. నేను నటించిన మరో చిత్రం శశివదనే డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్నాం. ప్రస్తుతం కథలు వింటున్నాను. రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)