Breaking News

మాలీవుడ్‌లో దడ పుట్టిస్తున్న  మిల్కీ బ్యూటీ

Published on Sun, 11/12/2023 - 09:23

తమన్నా.. ఇది ఇప్పుడు పేరు కాదు. గ్లామర్‌కు బ్రాండ్‌. అదీ హైపర్‌ బ్రాండ్‌. ఎక్కడైనా, ఎప్పుడైనా తన ప్రత్యేకతను చాటుకోవాల్సిందే, వార్తల్లో మారుమోగాల్చిందే. దట్‌ ఇస్‌ మిల్కీ బ్యూటీ. ఇటీవల జైలర్‌ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో విజృంభించి అందాలను ప్రదర్శించిన తమన్నకు ఇప్పుడు క్రేజ్‌ మామూలుగా లేదు. కాగా ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిగా తన సత్తాను చాటుకున్న తమన్న తాజాగా తన పేరును మాలీవుడ్‌ కు విస్తరింపచేసుకుంది.  అక్కడ పాదం మోపింది లేదో మాలీవుడ్‌  హీరోయిన్లకు  దడ పుట్టించింది.

నటుడు దిలీప్‌ కథానాయకుడుగా నటించిన బాంద్రా అనే చిత్రంతో తమన్నా కథానాయకిగా  మలయాళం చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్‌ లో నటుడు దిలీప్‌ పేర్కొంటూ ఈ చిత్ర కథ పూర్తి అయిన తర్వాత ఇందులో ఇప్పటివరకు మలయాళంలో నటించని, తనతో జతకట్టని నటిని హీరోయిన్‌గా నటింపజేయాలని భావించారన్నారు. దీంతో చాలా గట్స్‌ కలిగిన ఈ పాత్రకు నటి తమన్నా అయితే బాగుంటుందని అనిపించిందన్నారు. దర్శకుడు అరుణ్‌ గోపీ ఎలాగో తమన్నాకు కథ వినిపించి ఆమె అనుమతి పొందారన్నారు.

అయితే చిత్ర ప్రారంభోత్సవ పూజ వరకు ఆమె ఇందులో నటిస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో తమన్నా కాకుండా మరో ముఖ్యపాత్ర ఉందని ఆ పాత్రలో నటింప చేయడానికి పలువురు నటీమణులను సంప్రదించగా, తమన్నా ఉంటే చిత్రంలో తాము కనిపించమని భావించి ఇందులో నటించడానికి నిరాకరించారన్నారు. ఇలా తొలి చిత్రంతోనే మిల్కీ బ్యూటీ మాలీవుడ్‌ హీరోయిన్ల గుండెల్లో దడ పుట్టించిందన్నమాట. అయితే  నటి మమతా మోహన్‌ దాస్‌  ఆ చిత్రంలో మరో పాత్ర నటించడానికి ధైర్యంగా ముందుకు వచ్చిందట.  

:

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)