Breaking News

నేను పాత్రలు ఎంచుకోవడానికి ఆయనే కారణం: సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mon, 10/21/2024 - 20:05

హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ మత్స్యకారుని నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సాయి పల్లవి ఓ చిత్రంలో కనిపించనుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ మూవీలో నటించింది.

తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్‌ మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెకు నేను పెద్ద అభిమానిని.. ఏదో ఒక రోజు సాయిపల్లవితో కచ్చితంగా సినిమా తీస్తానని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలు విన్న సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది.

డైరెక్టర్ మణిరత్నం మాటలపై సాయిపల్లవి స్పందించింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం సార్ పేరు తప్ప.. ఇతర దర్శకుల పేర్లు తెలియవని చెప్పింది. అంతేకాకుండా తాను స్క్రిప్ట్‌లు, పాత్రలు ఎంచుకోవడానికి కూడా కారణం ఆయనేనని తెలిపింది. కాగా.. అమరన్‌ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు  రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)