Breaking News

'హలో మీరా' మూవీ రివ్యూ

Published on Fri, 04/21/2023 - 07:28

నటీనటులు: గార్గేయి ఎల్లాప్రగడ
దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల
నిర్మాణ సంస్థ: లూమియర్‌ సినిమా
నిర్మాతలు: డాక్టర్‌ లక్ష్మణరావు దిక్కుల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
సంగీత: ఎస్‌.చిన్న
సినిమాటోగ్రఫీ: ప్రశాంత్‌ కొప్పినీడు
విడుదల: ఏప్రిల్ 21, 2023

మంచి ప్రయోగాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం హలో మీరా. ఇది సింగిల్‌ పాత్రతో రూపొందిన సైకిలాజికల్‌ డ్రామా చిత్రం. సింగిల్‌ పాత్రతో చిత్రం చేయడం అంటే కత్తి మీద సామే. ఇంతకు ముందు నటుడు పార్తీపన్‌ ఇదే తరహాలో రూపొందించిన ఒత్త చెరుప్పు చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు పలు అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు బాపు శిష్యుడు శ్రీనివాసు కాకర్ల తెరకెక్కించిన వైవిధ్య భరిత కథా చిత్రం హలో మీరా. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదలైంది. సింగిల్  క్యారెక్టర్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. 



అసలు కథేంటంటే..
మీరా (గార్గేయి)కి అనే అమ్మాయికి రెండు రోజుల్లో పెళ్లి. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా.. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జాబ్‌ చేసే అమ్మాయి పెళ్లి కోసం తన ఫ్రెండ్స్‌ అందరూ వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు బయలుదేరుతారు. అప్పుడే టైలర్‌ దగ్గర కెళ్లి దుస్తులు కోసమని వెళ్లిన మీరాకు అప్పుడే ఒక ఫోన్‌ వస్తుంది. ఆ ఒక్క ఫోన్‌తో ఆమె జీవితం అంతా తలక్రిందులవుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్న అమ్మాయికి వచ్చిన ఫోన్‌ కాల్‌ ఎవరిది? అవతలి వ్యక్తి ఏం మాట్లాడారు? అసలు తన పెళ్లి జరిగిందా? ఇంతకీ ఆ కాల్ ఎవరిదై ఉంటుంది? అనేది తెలియాలంటే  'హలో మీరా'ను చూడాల్సిందే.

కథ ఎలా సాగిందంటే:
ఒక సినిమా తీయాలంటే ఈ రోజుల్లో నటీనటులు ఎంతో కీలకం. ఎంతోమంది పాత్రలను తెరకెక్కించాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు శ్రీనివాస్. కానీ చిత్రంలో మనకు తెరపై కనిపించేది కేవలం ఒక్కరే మీరా (గార్గేయి ఎల్లాప్రగడ). ఆమె తన పాత్రలో చూపించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 

సినిమాలో ఒక్క పాత్రే అయినా ‍ప్రతి క్షణం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ కథ మొత్తంలో మిగతా వారి ఫోన్ సంభాషణలతోనే కథ ఆసక్తికరంగా సాగింది. కానీ ఈ కథ మొత్తంలో తెరపై కనిపించింది మాత్రం మీరానే. హలో మీరా చిత్రంలో తాను చూపించిన హావభావాలకు ఎవరైనా ఫిదా కాకుండా ఉండలేరు. మొత్తానికి సగటు సినీ ప్రేక్షకుడిని సింగిల్ క్యారెక్టర్‌తో మెప్పించడం దర్శకుడు కాకర్ల శ్రీనివాస్‌ చేసింది పెద్ద సాహసమే అని చెప్పాలి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)