Breaking News

మనిషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా!

Published on Sat, 05/18/2024 - 11:32

ఓటీటీలో ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ వెబ్‌ సిరీస్‌ గురించే చర్చిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించాడు. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. లాహోర్‌లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించాడు భన్సాలీ. 

(చదవండి: 'హీరామండి' వెబ్‌ సిరీస్‌ రివ్యూ)

మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్‌ కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌కి ఓటీటీ ప్రేక్షకులను అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఫరీదాన్‌ పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించింది.మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్‌ సిరీస్‌కే హైలెట్‌. కొన్ని సీన్లలో మనిషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తిస్తుంది. తాజాగా సోనాక్షి ఆ సీన్ల గురించి మాట్లాడుతూ.. మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పింది. 

‘నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి వెబ్‌ సిరీస్‌ మొత్తం చూశాక ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సీన్లలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్‌ చూశాక..నేను అలా ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే మనీషాకు క్షమాపణలు చెప్పాను. ఆమెతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్‌ మొత్తం సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు. 

ఇక భన్సాలి గురించి మాట్లాడుతూ..‘ఆయన సినిమాలో నటించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్‌ షూటింగ్‌కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. హీరామండి లాంటి వెబ్‌ సిరీస్‌లో ఇంతగొప్ప పాత్ర ఇచ్చినందుకు భన్సాలిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని సోనాక్షి చెప్పారు. 
 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)