Breaking News

హనుమాన్‌ ఖాతాలో తొలి అవార్డు.. ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌

Published on Thu, 03/21/2024 - 13:36

ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మొదటి అవార్డు వచ్చి చేరింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేశాడు. బాక్సాఫీస్‌ వద్ద  పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం జీ5 ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

కేవలం రూ. 40 కోట్లతో హనుమాన్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మ.. ఒక్కసారిగా పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేయడమే కాకుండా .. హనుమాన్‌ కథకు ఇండియన్ మైథాలజీని లింక్‌ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో ప్రశాంత్‌ వర్మ కష్టం కనిపిస్తుంది. హనుమాన్‌ విజువల్స్‌ చూసిన చిన్న పిల్లల.పెద్దలు ఫిదా అయ్యారు. అందుకే వారందరినీ మరోసారి సినిమా చూసేలా చేశాయి.

థియేటర్స్‌లో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసిన హనుమాన్‌.. ఓటీటీలో కూడా సత్త చాటుంది. కొద్దిరోజుల క్రితమే హనుమాన్‌ కలెక్షన్స్‌ వర్షం ఆగింది.. ఇప్పుడు అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్‌లో హనుమాన్‌ సినిమాకు గాను బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును ప్రశాంత్‌ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని   తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.  ఇది  ఆరంభం మాత్రమే   అంటూ ఆయనకు ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)