Breaking News

'హనుమాన్‌' కలెక్షన్స్‌.. తొలి భారతీయ సినిమాగా రికార్డు

Published on Mon, 01/22/2024 - 13:04

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదే సమయంలో టాలీవుడ్‌లో విడుదలైన హనుమాన్‌ చిత్రం ఖాతాలో భారీ రికార్డ్‌ చేరింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ల సునామీ క్రియేట్‌ చేస్తుంది. సంక్రాంతి కానుకగా కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. 

2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్‌లో దుమ్మురేపింది. నార్త్‌ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్‌ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి.  

ఒక టికెట్‌ కొంటే ఇంకొకటి ఉచితం
నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్​ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్క్రీన్స్‌లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్‌  సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్​ సినిమాకు 'బై వన్‌ గెట్‌ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫ‌ర్ ఇస్తున్నట్లు ప్ర‌క‌టించింది.

బుక్​ మైషోలో 'MIRAJBOGO' అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది.  ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన హనుమాన్‌ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్​గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు.  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)