Breaking News

టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?

Published on Fri, 01/12/2024 - 17:07

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైపోయింది. 'హను-మాన్', 'గుంటూరు కారం' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. రెండింటిని పోల్చి చూసుకుంటే చాలామంది 'హను-మాన్' వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ 'హను-మాన్' టీంలో ఎవరికెంత ఇచ్చారు? 

'హను-మాన్' టాక్ ఏంటి?
ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. వీటిలో చాలామంది మహేశ్ 'గుంటూరు కారం' హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికంటే బెటర్ రివ్యూస్ ఇప్పుడు 'హను-మాన్' మూవీకి వస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్, ఆంజనేయుడి సెంటిమెంట్‌తోపాటు కంటెంట్ కూడా భలే క్లిక్ అయింది. గురువారం సాయంత్రం ప్రీమియర్స్ పూర్తవగానే.. అందరూ 'జై హనుమాన్' నామజపం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్‌’ మూవీ రివ్యూ)

అదే టైంలో దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కేవలం రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ రేంజు సినిమా తీశాడంటే.. మరికాస్త బడ్జెట్ ఇచ్చుంటే వేరే లెవల్ మూవీ తీసేవాడని అనుకుంటున్నారు. సరే ఇది పక్కనబెడితే ఈ మూవీకి నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్.. రూ.10 కోట్లు కూడా దాటలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.

'హను-మాన్' సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి గానూ ఇతడికి రూ.2 కోట్లు ఇచ్చారట. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య పారితోషికం అందుకున్నాడట. మిగతా నటీనటుల్లో హీరోయిన్ అమృత అయ్యర్-రూ 1.5 కోట్లు, వరలక్ష‍్మీ శరత్ కుమార్ రూ. కోటి, వినయ్ రాయ్ రూ.65 లక్షలు, వెన్నెల కిశోర్ రూ.55 లక్షలు, గెటప్ శీను రూ.35 లక్షలు అనే టాక్ వినిపిస్తుంది. మిగతా నటీనటులకు కాస్తోకూస్తే ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే రూ.10 కోట్ల లోపే రెమ్యునరేషన్ తేల్చేశారనమాట.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)