స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
Breaking News
కరోనాతో నెల రోజులు ఆస్పత్రిలోనే, హోప్స్ మొత్తం పోయాయి: నటి
Published on Mon, 06/07/2021 - 19:04
నటి హంస నందిని తన కుటుంబం ఇటీవల కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. తరచూ తనకు సంబంధించిన వీడియోలు, హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే ఆమె కొద్ది రోజులుగా ఒక్క పోస్టు షేర్ చేయలేదు. దీంతో హంసకు ఏమైందంటు ఫాలోవర్స్ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. తాను, తన కుటుంబ సభ్యులంతా కరోనా పాజిటివ్‌గా తేలిందని, 25 రోజుల పాటు కోవిడ్ హాస్పిటల్‌నే ఉన్నట్లు నెటిజన్లు పెట్టిన మెసేజ్‌లకు ఆమె సమధానం ఇచ్చారు. అంతేగాక ఇటీవల కోలుకుని వారు డిశ్చార్జ్ అయినట్లుగా కూడా ఆమె స్పష్టం చేశారు.
ఆమె స్పందిస్తూ.. ‘క్షమించండి. కొన్ని రోజులుగా ఎలాంటి పోస్ట్స్ షేర్ చేయ లేదు. ఏప్రిల్ 9న నేను కరోనా బారిన పడ్డాను. నా కుటుంబం కూడా మహమ్మారి బారిన పడింది. దీంతో దాదాపు 30 రోజుల పాటు కరోనాతో పోరాడం. తిరిగి ఇంటికి వస్తామన్న హోప్ కూడా పోయాయి. అయితే కరోనా అని తెలియాగానే నేను నా ఫ్యామిలీ వెంటనే ఆసుపత్రిలో చేరాము. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఇక 25 రోజుల తర్వాత నా కుటుంబం తిరిగి ఇంటికి వచ్చింది, ఇప్పుడిప్పుడే వారంతా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇంట్లోనే ఉండి మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి’ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది.
చదవండి:
నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న హీరోయిన్!
Tags : 1