Breaking News

ఆ విషయం డైరెక్టర్‌ చెప్పగానే వణికిపోయా.. గుంటూరు కారం హీరోయిన్!

Published on Mon, 01/22/2024 - 08:08

దళపతి, తమిళ స్టార్ హీరో విజయ్‌తో జత కట్టే అవకాశం అంత సులభంగా రాదు. అలా వచ్చిందంటే ఆమె లక్కీ హీరోయినే. తాజాగా ఆ ఛాన్స్‌ గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరిని వరించింది. విజయ్ నటిస్తోన్న‌ తాజా చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ఆల్‌ టైం(GOAT). ఈ చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అయితే తాజాగా విజయ్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. విజయ్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్‌తో కలిసి ఓ పాటకు డాన్స్‌ చేయనున్నట్లు దర్శకుడు ముందుగా చెప్పగానే నాకు దడ మొదలైందని అన్నారు. దీనికి కారణం ఆయన గొప్ప డాన్సర్‌ కావడమేనని పేర్కొన్నారు. అయితే విజయ్‌ మాత్రం తనతో చాలా ఉన్నతంగా నడచుకున్నారని చెప్పారు. ఆయనకు తాను కూడా వీరాభిమానిని అన్నారు గుంటూరు కారం భామ. విజయ్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని.. చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పారు. ఆయనతో కలిసి నటించడం సరికొత్త అనుభవమని పేర్కొన్నారు. కాగా.. మైక్‌ మోహన్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్‌, ప్రభుదేవా, ప్రేమ్‌జీ, వైభవ్‌ అరవింద్‌ ఆకాష్‌, నటి స్నేహ, లైలా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఇక మీనాక్షి సినిమాల విషయాకొనిస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇంతకుముందే విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన కొలై చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అదే విధంగా ఆర్‌జే బాలాజీ సరసన నటించిన సింగపూర్‌ సెలూన్‌ చిత్రం ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది.


 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి