Breaking News

రామబాణం మంచి సినిమా

Published on Mon, 05/01/2023 - 04:26

‘‘రామబాణం’లాంటి మంచి కథ ఇచ్చిన భూపతి రాజాగారికి థ్యాంక్స్‌. మంచి కమర్షియల్‌ ఫార్మాట్‌లో అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ కథ ఉంటుంది.. దాన్ని అంతే బాగా తీశాడు శ్రీవాస్‌. మా గత చిత్రాలు ‘లక్ష్యం, లౌక్యం’ లాగా ‘రామబాణం’ లోనూ మంచి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉంటాయి’’ అని హీరో గోపీచంద్‌ అన్నారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్‌ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘విశ్వ ప్రసాద్, వివేక్‌గార్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ఏది కావాలని అడిగినా.. ‘ఇది ఎందుకు?’ అని అడగరు.. అలాంటి మంచి మనసున్న వారికి మంచి జరగాలి. ‘రామబాణం’ చాలా మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం తర్వాత డింపుల్‌కి మంచి భవిష్యత్‌ ఉంటుంది. ‘లక్ష్యం’ తర్వాత జగపతి బాబుగారు, నేను మళ్లీ ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా చేశాం.. ఆయనతో చేస్తుంటే యాక్టర్‌ అని కాకుండా సొంత బ్రదర్‌లా అనిపిస్తారు.. అందుకే మా ఇద్దరి మధ్య సన్నివేశాలు, ఎమోషన్స్‌ బాగా పండాయి. నాది, అలీగారి కాంబినేషన్‌ చాలా బాగుంటుంది. 5న వస్తున్న ‘రామబాణం’ మీ అందరికీ (ఫ్యాన్స్, ఆడియన్స్‌) నచ్చుతుంది’’ అన్నారు.  

డైరెక్టర్‌ శ్రీవాస్‌ మాట్లాడుతూ – ‘‘రామబాణం’ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్‌గార్లు, నా లక్కీ హీరో గోపీచంద్‌గారు.. ఎలాంటి వివాదాలు లేకుండా పాజిటివ్‌గా ఉంటారు. అలా మా అందరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఓ పాజిటివ్‌ వైబ్రేషన్‌. హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ అంటూ మా మనసులో ఓ ఆలోచన తిరుగుతూ ఉండేది.. అది మాకు మరింత నమ్మకాన్ని, సంకల్పాన్ని ఇచ్చింది. ‘రామబాణం’ ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత నా అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌.. ‘టెక్నీషియన్స్‌ అని మరచిపోయి సినిమా చూశాం’ అన్నారు.. అంటే సినిమాలో అంత లీనమయ్యారు.. ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు. మా ‘లక్ష్యం, లౌక్యం’లకు మించి ‘రామబాణం’ పెద్ద హిట్‌ కావాలి. ఈ సినిమా ఎట్టి పరిస్థితిల్లోనూ గోపీచంద్‌గారి అభిమానుల అంచనాలకు తగ్గదు’’ అన్నారు.

సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల మాట్లాడుతూ–‘‘రామబాణం’ లాంటి మంచి సినిమా తీశాం. ఈ చిత్రానికి మీరు(ప్రేక్షకులు) మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘గోపీచంద్‌ 30 సినిమాలు చేస్తే దాదాపు 25 సినిమాల్లో తనతో కలిసి నేను నటించాను’’అన్నారు నటుడు అలీ.  ఈ వేడుకలో నిర్మాత కేకే రాధామోహన్, డైరెక్టర్స్‌ మారుతి, సంపత్‌ నంది, కార్తీక్‌ దండు, హర్ష, రచయిత కోనా వెంకట్, నటులు సోనియా చౌదరి, కాశీ విశ్వనాథ్, సప్తగిరి, తరుణ్‌ అరోరా తదితరులు పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)