Breaking News

ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్‌ మలినేని

Published on Thu, 01/19/2023 - 10:13

తనపై వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ మలినేని గోపిచంద్‌ స్పందించారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్‌ మూవీ వీర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్‌ జంటగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో గోపిచంద్‌ మలినేని స్టేజ్‌ మాట్లాడుతూ శృతి హాసన్‌కు ఐ లవ్‌ యూ  అని చెప్పిన సంగతి తెలిసిందే. 

చదవండి: అల్లు వర్సెస్‌ మెగా ఫ్యామిలీ రూమర్స్‌: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆ తర్వాత స్టేజ్‌పై మాట్లాడిన శృతి తెలుగు ఇండస్ట్రీలో తనకు ఓ అన్నయ్య ఉన్నారంటూ గోపీచంద్‌ గురించి చెప్పింది.  వీర సింహారెడ్డి సక్సెస్‌ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు గోపిచంద్‌ మలినేని. ఈ సందర్భంగా శృతి హాసన్‌కు ఐ లవ్‌ యూ చెప్పడం, ఆ తర్వాత ట్రోల్స్‌ రావడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది.  ‘శృతితో నాకు ఇది మూడో సినిమా. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి చేశాను. నాకు చాలా ఇష్టమైన హీరోయిన్‌ ఆమె. తను నాకు ఓ ఫ్యామిలీలో ఒక మనిషి లాగా. బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్‌ మాది.

చదవండి: రెండు రోజుల్లో మనోజ్‌ నుంచి స్పెషల్‌ న్యూస్‌, ఆసక్తి పెంచుతున్న ట్వీట్‌!

నా వైఫ్‌తో కూడా తను చాలా క్లోజ్‌. నా కొడుకు సాత్విక్‌ అంటే శృతికి చాలా ఇష్టం. వాడికి తరచూ చాక్లెట్స్‌, గిప్ట్స్‌ తీసుకువస్తుంది. అందుకే ఆమె స్టేజ్‌పై నాకు అన్నయ్య అని చెప్పంది. ఆ తర్వాత నేను మాట్లడినప్పుడు తను చెప్పిన దానికి నా కన్‌సన్‌ చూపించాను. ఈ నేపథ్యంలో ఐ లవ్‌ యూ అని చెప్పాను. కానీ దాన్ని సోషల్ మీడియాలో అబ్బాయి-అమ్మాయి లవ్‌గా మార్చి వైరల్ చేశారు. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)