‘కొరగజ్జ’ కోసం కొత్త ప్రయోగం చేశా: సంగీత దర్శకుడు గోపీ సుందర్‌

Published on Fri, 04/25/2025 - 17:47

‘కొరగజ్జ’చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టింది’అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి  గోపీ సుందర్ సంగీతం అందించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. దర్శకుడికి నా పని నచ్చినందుకు, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది.  ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది’ అని అన్నారు.

ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయి, వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచారు. ఈ పాటలకు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన గాయకులు పాటలు పాడారు. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. దర్శకుడికి నా పని నచ్చినందుకు, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది’ అన్నారు.

"కాంతార" సినిమా కంటే ఎంతో భిన్నంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ‘కాంతార’ ఒకరిని మాత్రమే చూపించింది. దీనిపై EP శ్రీ విద్యాధర్ శెట్టి సహాయంతో దర్శకుడు సుధీర్ అత్తవర్ పరిశోధన చేశారు. ‘కాంతార’ తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మల్టీ లాంగ్వేజెస్‌లో విడుదల కానుంది.

ఇందులో కబీర్ బేడి, ప్రఖ్యాత కొరియోగ్రాఫర్లు సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, దక్షిణాది అగ్ర నటులు భవ్య, శ్రుతి మరెంతో అద్భుతమైన సమిష్టి తారాగణం పని చేసింది. మనోజ్ పిళ్ళై సినిమాటోగ్రఫీ, జిత్ జోషి, విద్యాధర్ శెట్టి ఎడిటింగ్, బిబిన్ దేవ్ సౌండ్ డిజైనింగ్, మూడుసార్లు కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న డిఐ కలరిస్ట్ లిజు ప్రభాకరన్ డిఐ, లవన్-కుషన్ విఎఫ్ఎక్స్ & గ్రాఫిక్స్ వంటి అసాధారణ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేసింది. ఇక ఈ మూవీ ఆడియో రైట్స్ కోసం భారీ రేటుని చెల్లించేందుకు పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)