Breaking News

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆర్ఆర్‌ఆర్‌... అవార్డ్‌ వచ్చేసింది!

Published on Wed, 01/11/2023 - 07:30

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్‌ జూ. ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్‌ఆర్ఆర్‌’ ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒక్కో అడుగు వేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుని కైవసం చేసుకుని భారతీయుల సత్తా చాటింది.

ఆర్‌ఆర్‌ఆర్‌కు ప్రతిష్టాత్మక అవార్డను కైవసం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ వచ్చింది. ఈ అవార్డ్‌ను సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందుకున్నారు. ‘నాటు నాటు’ పాటను చంద్రబోస్‌ రాయగా, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ పాడారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.  గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గతంలో ఈ అవార్డులు గెలుచుకున్న ఎన్నో సినిమాలు ఆస్కార్స్‌లోనూ సత్తా చాటాయి. 

ఈ కేటగిరిలో మరో 4 మంది నామినీలపై నాటు నాటు గట్టి పోటీనే ఎదర్కొని ఈ అవార్డ్‌ని కైవసం చేసుకుంది. ఈ పాట గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్‌ సాధించడం, భవిష్యత్తులో మరిన్ని భారతీయ చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందనే చెప్పాలి. గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్‌ కైవసంతో, ఇక అందరి కళ్లు జనవరి 24, 2023న జరగనున్న అకాడమీ అవార్డ్స్ ఫైనల్ నామినేషన్ జాబితాపై పడింది. 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)