Breaking News

ట్యూన్‌ పూర్తయిన రోజే విషాదం.. చివరికీ: ది గోట్ డైరెక్టర్ ఎమోషనల్

Published on Tue, 09/03/2024 - 19:13

కోలీవుడ్ డైరెక్టర్‌ వెంకట్ ప్రభు తెరకెక్కించిన తాజా చిత్రం 'ది గోట్'. తమిళ స్టార్, దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ సంఘటనను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. అదేంటో తెలుసుకుందాం.

గోట్ మూవీలో  ఓ పాటకు ట్యూన్‌ పూర్తయ్యాక ఓ విషాద వార్త వినాల్సి వచ్చిందని వెంకట్ ప్రభు తెలిపారు. ఆ సాంగ్‌కు సింగర్ భవతారిణితో పాడించాలని అనుకున్నట్లు వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఆమె మరణవార్త వినాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె సోదరుడు యువన్ శంకర్ రాజా ఈ పాటను కంపోజ్ చేశారని.. తాను ట్యూన్‌ కంపోజ్ చేసిన రోజే భవ‌తారిణి చ‌నిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆమెతోనే ఈ పాటను పాడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఏఐ సాయంతో వాయిస్..

ఎలాగైనా సరే భవతారిణి వాయిస్‌తోనే ఆ పాటను పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని వెంకట్ ప్రభు అన్నారు. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ సాయంతో ఎలా చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించామని తెలిపారు. గతంలో ఏఆర్ రెహమాన్ తన పాట కోసం షాహుల్ హమీద్ వాయిస్‌ని ఎలా ఉపయోగించాడో.. అలాగే మనం కూడా చేద్దామని యువన్ శంకర్‌ రాజాకు చెప్పానని వెల్లడించారు. ఆ తర్వాత వారిని సంప్రదించి సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేశారని పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చిన్న చిన్న కనగల్ పాటకు ఆమె వాయిస్‌ను జోడించామని వెంకట్ తెలిపారు. భవతారిణి వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించిన విధానాన్ని ఆయన వివరించారు. ఈ సాంగ్‌ మేల్ వాయిస్‌ను హీరో విజయ్ పాడారని.. మా సినిమాలో విజయ్‌ రెండు పాటలు పాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

కాగా.. కోలీవుడ్‌లో సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇళయరాజా కూతురు భవతారిణి జనవరి 25న శ్రీలంకలో క్యాన్సర్‌తో మరణించారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 47 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతి చిత్రంలోని 'మయిల్ పోల పొన్ను ఒన్ను' అనే తమిళ పాటకు భవతారిణి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)