Breaking News

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఫ్యాన్స్‌కి తప్పని ఆ ఇబ్బంది!

Published on Sat, 11/15/2025 - 18:30

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ గురించే చర్చ నడుస్తోంది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న ఈవెంట్‌కి అభిమానులు బాగానే వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి కూడా. అయితే మిగతా అందరికీ కాదు గానీ అభిమానులకు మాత్రం ఓ విషయంలో ఇబ్బంది తప్పట్లేదు. పలువురు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం పసుపు, ఎరుపు, తెలుపు, ఊదా(వయలెట్) రంగుల్లో పాస్(పాస్‌పోర్ట్స్)లు జారీ చేశారు. వీటిలో అభిమానులకు పసుపు రంగు పాస్‌లు ఇచ్చారు. వీటిని తీసుకుని అభిమానులు కార్యక్రమానికి వెళ్లారు. అయితే మిగతా అన్ని పాస్‌లు ఉన్నవాళ్లకు ఎలాంటి సమస్య లేదు గానీ పసుపు రంగు పాస్‌లు ఉన్నవాళ్లతో పాటు వాటర్ బాటిల్స్‌ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వట్లేదట. బదులుగా వాటర్ పాకెట్స్ ఇస్తున్నారు గానీ అవి ఏ మేరకు అవసరం ఉన్నవాళ్లకు అందుతాయనేది చూడాలి.

ఈవెంట్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాలంటేనే అభిమానులు.. 3-4 కిలోమీటర్లు నడవాలి అని తెలుస్తోంది. వెళ్లిన తర్వాత కనీసం వాటర్ బాటిల్‌ని కూడా అనుమతించకపోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళితో పాటు ఈ సినిమాలో భాగమైన ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరు కానున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మూవీ టైటిల్‌తో పాటు సినిమా ఎలా ఉండబోతుందా అనే విజువల్స్‌తో కూడిన వీడియోని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ట్వీట్ చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)