Breaking News

టీజర్ సూపర్ ఉంది కానీ ఆ ఒక్కటే!

Published on Wed, 07/12/2023 - 16:33

Ghost Teaser Telugu: సినిమాపై అంచనాలు పెరగాలంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి చాలా ముఖ్యం. ఈ మధ్య వచ్చిన 'సలార్' టీజర్ బాగుంది. మేం ఒప్పుకొంటాం. కానీ అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేదని బాధ ఫ్యాన్స్‌కి ఇప్పటికీ ఉండిపోయింది. సరే దాని గురించి వదిలేస్తే తాజాగా ఓ డబ్బింగ్ సినిమా టీజర్ రిలీజైంది. దీన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ప్రభాస్ కటౌట్‌కి ఇలాంటి పడాల్సింది అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?

సూపర్ టీజర్
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఎంత ఫేమస్ అనేది మీలో చాలామందికి తెలుసు. ఇతడి అన‍్న శివరాజ్ కుమార్ కూడా అక్కడ వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఆయన నటించిన సినిమానే 'ఘోస్ట్'. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ చిత్ర టీజర్ ని శివన్న పుట్టినరోజు సందర‍్భంగా బుధవారం రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. 

(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)

టీజర్‌లో ఉన్నది ఇదే
ఓ పాడుబడిన బిల్డింగ్ లో ఓ వ్యక్తి. అతడు ప్రాణాలతో కావాలని వాయిస్ ఓవర్‌లో ఓ వ్యక్తి ఆర్డర్. అతడితో జాగ్రత్త అని గన్స్ తో ఉన్నవాళ్లకు హెచ్చరిక. అప్పుడు శివరాజ్ కుమార్ ఎంట్రీ. ఆయుధాలతో ఉన్న వాళ్లు తనని చుట్టుముట్టినా సరే స్టైల్‌గా విస్కీతో పానిపూరీ తింటాడు. ఓ కర్రకి నిప్పి అంటించి దాంతో సిగరెట్ వెలిగిస్తాడు. దాన్ని వెనక్కి విసిరితే కవర్ కాలిపోయి వార్ ట్యాంకర్ బయటపడుతుంది. 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనే డైలాగ్ కూడా బాగుంది.

వేరే హీరో ఉంటే మాత్రం
టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ ఉన్నాయి. కాకపోతే హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇలాంటి టీజర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ హీరోలు ఎవరైనా ఉండుంటే మాత్రం నెక్స్ట్ లెవల్‌ ఉండేది. ఇకపోతే 'ఘోస్ట్' చిత్రానికి శ్రీని దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. దసరాకి ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. 

(ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్‌.. ఆ స్టార్ హీరోతో కలిసి!)

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు