Breaking News

స్టార్ హీరో మూవీ వాయిదా.. డైరెక్టర్‌ ఆసక్తికర పోస్ట్!

Published on Wed, 11/29/2023 - 11:50

కోలీవుడ్ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం చిత్రం ధృవనచ్చితిరం.  స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గౌతమ్ మీనన్ అభిమానులకు షాకిచ్చాడు. అయితే తాజాగా ఆయన ఓ లేఖను పోస్ట్ చేశారు. ధృవనచ్చితిరం త్వరలోనే మీ ముందుకు వస్తుందని గుడ్‌ న్యూస్ చెప్పారు. 

దర్శకుడు లేఖలో రాస్తూ.. ''ఒక విజన్, అభిరుచి, అంకితభావంతో ధృవ నచ్చితిరాన్ని తెరకెక్కించాం. మాకు ఎంత వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ ముందుకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. నవంబర్ 24న విడుదల చేయనందుకు అభిమానులు నిరాశకు గురైన మాట వాస్తవమే. ఇప్పటికీ మేము సినిమా రిలీజ్ విషయంలో  ప్రేక్షకులకు భరోసా ఇవ్వడానికే పోస్ట్ చేస్తున్నా. మూవీకి ఉన్న అడ్డంకులను తొలగించి ధృవ నచ్చితిరమ్‌ను త్వరలోనే మీముందుకు తీసుకొస్తాం' అని అన్నారు.

ఈ విషయంలో ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఇప్పటికైనా వివాదాలు తొలగిపోయి మూవీ రిలీజ్ కావాలని విక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  కాగా.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఆర్. పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌